ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం మ్యాపింగ్ ముగిసింది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్ఓలు) ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. ఇప్పటికే ప్రాథమిక సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా రెండు చోట్ల ఓట్లు ఉన్న సుమారు 2 లక్షల మందిని గుర్తించి తొలగించగా, మరో 2.5 లక్షల ఓట్లపై విచారణ జరుగుతోంది. ఓటర్ల జాబితాలో మార్పులు లేదా కొత్త నమోదు కోసం ఈసీ 11 రకాల గుర్తింపు కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది.
అయితే, పుట్టిన సంవత్సరం ఆధారంగా నిబంధనల్లో మార్పులు ఉన్నాయి. 1987 కంటే ముందు జన్మించిన వారు తల్లిదండ్రుల వివరాలను సమర్పించాల్సి ఉండగా, 1987-2004 మధ్య జన్మించిన వారికి బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి. పాస్పోర్ట్, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, బ్యాంక్ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, భూమి కేటాయింపు పత్రాలను కూడా ఆధారాలుగా అంగీకరిస్తారు. ఈ సమగ్ర సవరణ ద్వారా మరణించిన వారి పేర్లు, నకిలీ ఓట్లు, వలస వెళ్ళిన వారి వివరాలను తొలగించి అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే ఈసీ ప్రధాన లక్ష్యం.

More Stories
సింగర్ మంగ్లీపై రూ. 10 కోట్ల మోసం కేసు
మహిళలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు
గిరిజన విశ్వవిద్యాలయం కోర్సులకు ఐఐటిహెచ్ సహకారం