ఆదిలాబాద్‌లో సైనిక, పౌరుల అవసరాలకు అనుగుణంగా పెద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని కేంద్రం భావిస్తోంన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ సైన్యానికి శిక్షణతో పాటు సివిల్ ఏవియేషన్ అవసరాల కోసం వాడాలని రక్షణశాఖ మంత్రి చెప్పినట్లు గుర్తుచేశారు.
ఈనెల 17న ఆదిలాబాద్ భూముల పరిశీలనకు అధికారులు వెళ్తారని, రక్షణశాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశాక తుది నిర్ణయం తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు వివరించారు. ఇక్కడ రక్షణశాఖకు చెందిన 360 ఎకరాల భూమి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. సైనిక, పౌరుల అవసరాలకు అనుగుణంగా ఇది ఉంటుంది అని తెలిపారు.
మామునూరు ఎయిర్పోర్టుకు మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లుగా. వెల్లడించారు. అలాగే కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైనట్లు ఆయన చెప్పారు. ఎప్పటి నుంచో తెలంగాణలో ఒకే విమానాశ్రయం కేవలం హైదరాబాద్‌లోనే ఉందని, మిగిలిన ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలు ఉండాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షిస్తున్నారని ఆయన చెప్పారు.
ఫీజిబిలిటీకి తగ్గట్లుగా విమానాశ్రయాలు నిర్మించాలనేది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన అని ఆయన చెప్పారు. “ఎంతోకాలం నుంచి కేవలం ఒక ఎయిర్స్ట్రిప్గా ఉండిపోయిన వరంగల్లోని మామునూరు ఎయిర్‌పోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించి భూమిని అప్పగించింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున నిర్ణయం తీసుకుని ఒక మంచి ఎయిర్పోర్టును నిర్మించాలని అడుగులు వేస్తున్నాం. మరో మూడు నెలల్లో దానికి శంకుస్థాపన చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం” అని తెలిపారు.
“గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతమైన ఆదిలాబాద్‌లో నూతనంగా ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలనేది చిరకాలంగా ఉన్న డిమాండ్. ఆదిలాబాద్‌లో పెద్ద ఎయిర్పోర్టును నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. విమానాశ్రయాలపై వస్తున్న అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నాం. ఫీజబులిటి ఉన్న చోట ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని కేంద్ర మంత్రి వివరించారు.

More Stories
తెలంగాణలో గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలి
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తారామతిలో బాలీవుడ్ నటుడితో పాటు ఓ జంటకు పాజిటివ్