పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కొల్లగొడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆదివారం ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్ బెహర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటూ రాష్ట్రంలో మహా జంగిల్ రాజ్ నడుస్తోందని టీఎంసీ పాలనపై మండిపడ్డారు.
‘‘పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది. అక్రమ చొరబాటుదారులకు మమత అండగా నిలుస్తోంది. మాల్దా, సందేష్‌కాలి ఘటనలు ఆమె ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. బెంగాల్‌లో మహా జంగిల్ రాజ్ (ఆటవిక రాజ్యం) నడుస్తోంది. ప్రజా ధనాన్ని టీఎంసీ కొల్లగొడుతోంది. కానీ, మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత వారు దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందే” అని స్పష్టం చేశారు.
“జనాభాలో మార్పుల కారణంగా ఒకవైపు మన నేలపైనే స్వేచ్ఛను కోల్పోతున్నాం. ఇంకోవైపు బీజేపీ ఉంది. సొంత నేలపై సగర్వంగా, తలెత్తుకుని నిలబడగల ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఒకవైపు సిండికేట్ పాలనలో ఆస్తుల్ని కోల్పోతామనే భయం. ఇంకోవైపు తమ భూమిపై యాజమాన్య హక్కులు కల్పించగలదనే విశ్వాసం ఇవ్వగల పార్టీ’’ అంటూ బీజేపీ గురించి మోదీ చెప్పారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. అక్రమ చొరబాటుదారుల్ని రక్షించేందుకే మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ‘సర్’ను అడ్డుకుంటోందని ప్రధాని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కోరుతూ ఈ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ భవిష్యత్‌ను నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
మాల్దాలో న్యాయాధికారులను నిర్బంధించడాన్
ఎన్నికల రోజు టీఎంసీకి భయపడవద్దని మోదీ ప్రజలను కోరారు. ఈ ఎన్నికలు బెంగాల్ ప్రజల్లోని భయాన్ని బయటకు తొలగిస్తాయని స్పష్టం చేశారు. ఇటీవల జడ్జీలు, పౌరులు ఎలా ఇబ్బంది పడ్డారో ప్రజలు చూశారని మోదీ గుర్తు చేశారు. బెంగాల్‌లో శాంతిభద్రతలకు అంతిమ యాత్ర నిర్వహించేందుకు టీఎంసీ కంకణం కట్టుకుందని ప్రధాని విమర్శించారు. ఎన్నికల తర్వాత టీఎంసీ పాపాల లెక్క తేల్చటమే కాకుండా బాధ్యులైన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.

More Stories
అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో బిజెపి గెలుపు ఖాయం
దక్షిణాది సీట్లు తగ్గుతాయనడం అసత్యం
చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడులో ఐఎస్ఐ హస్తం?