పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌కు యూఏఈ షాకిచ్చింది. తమ దగ్గర తీసుకున్న అప్పును పూర్తిగా, అది కూడా వెంటనే చెల్లించాలని కోరింది. దీంతో ఈ నెలలోనే యూఏఈ అప్పు తీర్చేందుకు పాక్ సిద్ధమైంది. మొత్తం 3.5 బిలియన్ డాలర్ల అప్పును యూఏఈకి పాకిస్తాన్ ఈ నెలలోనే చెల్లించబోతుంది. ఒకవైపు అంతర్జాతీయ రిజర్వ్స్ తక్కువగా ఉన్నా, మరోవైపు ఐఎంఎఫ్ నుంచి ఒత్తిడి ఉన్నా పాక్ తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు తీర్చేయబోతుంది.
ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా యూఏఈ కూడా ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటుంది. దీంతో తమ బాకీ చెల్లించాలని పాక్‌ను కోరింది. దీనికి పాకిస్తాన్ కూడా అంగీకరించింది.
ఈ నెల 11న 450 మిలియన్ డాలర్లు, 17న 2 బిలియన్ డాలర్లు, 23న బిలియన్ డాలర్లను పాక్ చెల్లించేందుకు అంగీకరించింది. సెంట్రల్ బ్యాంకుకు చెందిన 16.4 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వల నుంచి ఈ నిధులను పాక్ చెల్లించబోతుంది. ఈ అప్పుల్లో మూడు దశాబ్దాల నాటి అప్పు కూడా ఉండటం విశేషం.
కొనసాగుతున్న ప్రాంతీయ సంఘర్షణ సమయంలో ఇరాన్‌తో పాకిస్తాన్ సన్నిహితంగా ఉండటం పట్ల అబుదాబి అసంతృప్తిగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది పాకిస్తాన్ విదేశాంగ విధాన ప్రాధాన్యతల గురించి ఎమిరేట్స్ అధికారులలో ఆందోళనలను పెంచింది. సంబంధాలలో ఈ ఒత్తిడి భవిష్యత్ ఆర్థిక మద్దతుపై కూడా ప్రభావం చూపవచ్చు, ఎందుకంటే యూఏఈ నుండి రావలసిన ప్రత్యేక 2 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీ ఇప్పుడు అనిశ్చితంగా కనిపిస్తుంది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ముందుగా అంగీకరించిన మొత్తమే చెల్లించేందుకు సిద్ధంగా లేకపోవడంతో, పాకిస్తాన్ మిత్ర దేశాల మద్దతుపై ఎక్కువగా ఆధారపడటం కొనసాగిస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ మరియు చైనా వంటి దేశాలు ఆర్థిక డిపాజిట్లను నిర్వహించడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తున్నాయి.
1996-97లో పాకిస్తాన్ 450 మిలియన్ డాలర్లను అప్పుగా తీసుకుంది. అప్పట్లో ఒక సంవత్సర కాల పరిమితితో ఈ అప్పు తీసుకుంది. అయితే, ఇంతవరకు చెల్లించలేదు. నిజానికి పాకిస్తాన్‌కు ఇచ్చిన అప్పు కాల పరిమితిని పొడిగించాలని ఇటీవల యూఏఈ నిర్ణయించింది. దీనిపై ఇంకా సంప్రదింపులు జరుగుతుండగానే యుద్ధం ప్రారంభమవ్వడంతో యూఏఈ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ఇతర దేశాల నుండి పదేపదే ఆర్థిక సహాయం కోరడం జాతీయ “ఆత్మగౌరవాన్ని” దెబ్బతీస్తుందని, ఎందుకంటే రుణదాతలు తరచుగా ప్రతిఫలంగా ఏదో ఆశిస్తారని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవల అంగీకరించారు. ఎగుమతులు తగ్గుముఖం పట్టడం, పెట్టుబడులు మందగించడం, రుణ చెల్లింపులు పెరగడం వంటి నేపథ్యంలో, ఈ 3.5 బిలియన్ డాలర్ల రుణ చెల్లింపు మరింత తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎత్తిచూపుతోందని నివేదిక పేర్కొంది.

More Stories
ఆఫ్రికాలో చిన్న దేశం అంగోలా నుంచి భారత్ కు చమురు
విదేశీ ఔషధాలపై ట్రంప్ 100 శాతం దిగుమతి సుంకాలు
భారత్‌కు మరింత చమురు, గ్యాస్.. రష్యా హామీ