* ఇరాన్ బ్రిడ్జిపై అమెరికా దాడి దాడి.. 8 గల్ఫ్ బ్రిడ్జీలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిక
అమెరికాకు చెందిన మరొక ఐదోతరం ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చేశామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. సెంట్రల్ ఇరాన్ గగనతలం మీదుగా వెళ్తున్న ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను ఒక అధునాతన గగనతల రక్షణ వ్యవస్థతో కూల్చినట్లు వెల్లడించింది. తమ ఇంటర్‌సెప్టర్ మిస్సైల్ తాకగానే అమెరికా యుద్ధ విమానం ఎఫ్-35 భారీ పేలుడుతో కూలిపోయే స్థితికి చేరిందని, అందులోని పైలట్ బతికి బయటపడటం కష్టమేనని ఇరాన్ సైన్యం ప్రధాన కార్యాలయం ఖతం అల్ అంబియా అధికార ప్రతినిధి తెలిపారు.
దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ దేశంలోని ప్రధాన బ్రిడ్జిపై అమెరికా చేసిన దాడికి ప్రతిగా.. తాము కూడా గల్ఫ్ దేశాల్లోని ప్రధాన బ్రిడ్జిలపై దాడులకు దిగుతామని ప్రకటించింది. అంతేకాదు.. గల్ఫ్ దేశాల్లో దాడిచేయబోయే ఎనిమిది బ్రిడ్జిల వివరాలు వెల్లడించింది. కువైట్‌లోని షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సబా బ్రిడ్జి, యూఏఈలోని షేక్ జాయెదే బ్రిడ్జి, అల్ మక్తా బ్రిడ్జి, షేక్ ఖలిఫా బ్రిడ్జి, సౌదీ అరేబియా-బహ్రెయిన్‌లోని కింగ్ ఫాహద్ కాజ్వే, జోర్డాన్‌లోని డామియా బ్రిడ్జి, అబ్డోన్ బ్రిడ్జిలను పేల్చేస్తామని ప్రకటించింది.
ఈ ప్రాంతంలో ఈ బ్రిడ్జిలు రవాణాకు చాలా కీలకం. అందుకే ఇరాన్ వీటిని లక్ష్యంగా ఎంచుకుంది. ఐఆర్జీసీ ఆధ్వర్యంలో దాడులు చేస్తామని హెచ్చరించింది. అమెరికా పాక్షికంగా కూల్చేసిన బీ1 బ్రిడ్జి ఇరాన్‌కు చాలా కీలకం. ఇది 136 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇంకా కొంత ప్రాంతం నిర్మాణంలో ఉంది. ఇది టెహ్రాన్, కరాజ్ పట్టణాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై రెండుసార్లు జరిగిన వైమానిక దాడిలో ఎనిమిది మంది మరణించారు. 95 మంది గాయపడ్డారు. ఈ దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పౌర నిర్మాణాల్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సరికాదని మండిపడ్డారు.

More Stories
అటార్నీ జనరల్ పామ్ బాండీపై వేటు
హోర్ముజ్‌ను తిరిగి తెరవాలని 60 దేశాల పిలుపు
కాల్పుల విరమణకై పాక్ మధ్యవర్తులతో జెడి వాన్స్ మంత్రాంగం