* ఆర్మీ తాత్కాలిక చీఫ్‌గా క్రిస్టోఫర్ లానీవ్!
అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీపై డోనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. వ్యాపారి, సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులో ఫైళ్లను సరైన రీతిలో హ్యాండిల్ చేయలేదన్న నెపంతో పామ్ బాండీపై వేటు వేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ట్రంప్, బాండీ సన్నిహితులే. కానీ ఎప్‌స్టీన్ ఫైళ్ల కేసును హ్యాండిల్ చేసిన తీరు పట్ల డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఆమెపై ఆగ్రహంగా ఉన్నారు. మన్‌హట్టన్ జైలులో ఎప్‌స్టీన్ మృతిచెందిన అంశాన్ని కూడా సరైన రీతిలో కవరప్ చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ట్రుత్ సోషల్‌లో బాండీకి థ్యాంక్స్ చెప్పారు ట్రంప్. విధ్వంసాన్ని ఎదుర్కోవడంలో ఆమె తీవ్ర పోరాటం చేసినట్లు తెలిపారు. పామ్‌ను ప్రేమిస్తామని, కానీ ఆమె కొత్త జాబ్‌కు వెళ్తోందని, ప్రైవేట్ సెక్టార్‌లో ఆమె పనిచేయనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. బాండీకి డిప్యూటీగా చేసిన ట్రంప్ మాజీ లాయర్ టాడ్ బ్లాంకె ఇప్పుడు అటార్నీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ముఖ్యంగా తాను దర్యాప్తు ఎదుర్కోవాలని కోరుకున్న విమర్శకులు, ప్రత్యర్థులపై అభియోగాలు మోపడంలో బోండీ తగిన విధంగా వ్యవహరించకపోవడం ట్రంప్‌ను తీవ్ర అసహనానికి గురిచేసినట్లు తెలుస్తున్నది.
యుఎస్ అటార్నీ జనరల్‌గా బోండీ తన పదవీ కాలంలో ట్రంప్ అజెండాకు గట్టి మద్దతుదారుగా నిలిచారు. న్యాయశాఖ తన దర్యాప్తులో వైట్‌హౌస్ నుండి స్వతంత్రంగా వ్యవహరించే సుదీర్ఘ సాంప్రదాయాన్ని ఇది నాశనం చేసింది. ట్రంప్ మిత్రులు, కొంతమంది రిపబ్లికన్ చట్టసభ్యులు సహా ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై వచ్చిన విమర్శలు ఆమెను చుట్టుముట్టాయి.
అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను కూడా తొలగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీనియర్ అధికారుల పదోన్నతులు, సైనిక నిర్ణయాలపై నియంత్రణపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌తో ఏర్పడిన తీవ్ర విభేదాల కారణంగా రాండీ జార్జ్‌ను తొలగించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. చీఫ్ జనరల్ పదవికి రాజీనామా చేయాలన్న హెగ్సెత్ నిర్ణయంపై వెంటనే జార్జ్ రాజీనామా చేసినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. అమెరికా ఆర్మీ తాత్కాలిక చీఫ్‌గా జనరల్ క్రిస్టోఫర్ లానీవ్ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

More Stories
అమెరికాకు చెందిన మరో ఎఫ్-35ను కూల్చేశాం
హోర్ముజ్‌ను తిరిగి తెరవాలని 60 దేశాల పిలుపు
కాల్పుల విరమణకై పాక్ మధ్యవర్తులతో జెడి వాన్స్ మంత్రాంగం