నెగెవ్ 7.62 ఎల్ఎంజీ ప్రత్యేకతల విషయానికి వస్తే, అత్యంత తేలికైన మెషీన్ గన్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. కఠిన పరిస్థితుల్లో కూడా అత్యంత కచ్చితత్వంతో పనిచేసేలా దీన్ని రూపొందించారు. ఈ ఆయుధాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకునే సామర్థ్యం వీటికి ఉంది. ఈ అత్యాధునిక ఆయుధాలు భారత సైనికులకు సరిహద్దుల్లో గొప్ప శక్తిని ఇస్తాయి. తేలికపాటి ఆయుధం కావడంతో యుద్ధ రంగంలో సైనికులు దీనిని సులభంగా తరలించవచ్చు.
ఈ ఎల్ఎంజీకి సెమీ-ఆటోమేటిక్, ఫుల్-ఆటోమేటిక్ అనే రెండు రకాల విధానాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి భూమిపై మాత్రమే కాకుండా హెలికాప్టర్లు, వాహనాలు, నౌకలపై కూడా అమర్చే సౌకర్యం కల్పించారు. ఇది సైనిక చర్యల్లో విస్తృత వినియోగాన్ని అందిస్తుంది. దీని తేలికపాటి డిజైన్, అలాగే 7.62 మిల్లీమీటర్ గుండు సామర్థ్యం కారణంగా బలమైన కవర్‌ను కూడా ఛేదించే శక్తి దీనికి ఉంది.
దీంతో పట్టణ యుద్ధ పరిస్థితుల్లో, ముఖ్యమైన ఆపరేషన్లలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ వెలుతురు పరిస్థితుల్లో కూడా కచ్చితమైన లక్ష్య సాధన కోసం పికాటిన్నీ రైల్స్, ట్రిటియం నైట్ సైట్స్‌ను ఇందులో అమర్చారు. నాటో ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఆయుధాలను రూపొందించారు. ఈ ఆయుధం దీర్ఘకాలిక వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. అదనంగా కంప్యూటరైజ్డ్ వెపన్ సిస్టమ్‌తో అనుసంధానం చేసే సౌకర్యం ఉండటం వల్ల ఎంత ఒత్తిడిలోనైనా లక్ష్యాలను కచ్చితంగా చేధించగలదు.

More Stories
మార్చిలో రూ.2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ముడి చమురు
చైనా సీసీటీవీ కెమెరాలపై భారత్ లో నిషేధం!