ఐప్యాక్‌ కార్యాలయాలలో ఈడీ సోదాలు

ఐప్యాక్‌ కార్యాలయాలలో ఈడీ సోదాలు

బొగ్గు స్మగ్లింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ  ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్  కార్యాలయాలపై మెరుపు దాడులు నిర్వహించింది. పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసులో భాగంగా ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న ఐప్యాక్ కార్యాలయాలపై దృష్టి సారించారు.  ఈడీ కోల్‌కతాలోని ఐప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసంతోపాటు హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీల్లోని ఐప్యాక్‌ కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపడుతున్నారు.

ఈ కన్సల్టెన్సీ డైరెక్టర్లలో ఒకరైన రిషిరాజ్‌ సింగ్‌కు చెందిన  బెంగళూరు ప్రాంగణంపై కూడా దర్యాప్తు సంస్థ దృష్టిసారించింది. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కొంతకాలంగా సోదాలు జరుగుతున్నాయి. గత జనవరిలో బెంగాల్‌లో జరిగిన ఈ సోదాలు కలకలం రేపిన  సంగతి తెలిసిందే. సోదాలు జరుగుతున్న సమయంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐప్యాక్ చీఫ్ ఇంటికి వెళ్లారు.

సోదాల సమయంలో బెంగాల్ ప్రభుత్వం నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ఈడీ ఆరోపించింది. ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.  వారి వాంగ్మూలాలను నమోదు చేయడానికి సింగ్, జైన్‌లను ఈడీ ఇటీవల పిలిపించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో ఎన్నికల పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ, తమకు జారీ చేసిన ఈ నోటీసులను రద్దు చేయాలని వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 2019 లోక్‌ సభ ఎన్నికల తర్వాత ఐప్యాక్‌ నుంచి టీఎంసీతో కలిసి పనిచేస్తోంది. పైగా, ఆ పార్టీ ఐటి, మీడియా విభాగాలను పర్యవేక్షిస్తుంది.