“పామ్ సండే ప్రార్థనల సందర్భంగా పోప్-14 శాంతి కోసం శక్తివంతమైన విజ్ఞప్తిని నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. శాంతి కోసం ఆయుధాలను విడిచిపెట్టాలని, హింసను త్యజించాలని ఆయన చేసిన పిలుపు నన్ను ఎంతగానో కదిలించింది. ఎందుకంటే అన్ని ప్రధాన మతాలు ఇదే సారాంశాన్ని భోదిస్తాయి” అని తెలిపారు.
“క్రైస్తవ మతం, బౌద్ధ మతం, ఇస్లాం, హిందూ మతం, యూదు మతం లేదా ప్రపంచంలోని ఏ గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని చూసినా వాటి సందేశం ప్రాథమికంగా ఒక్కటే. ప్రేమ, కరుణ, సహనం ఆత్మ నిగ్రహం. ఈ మతాల బోధనలలో దేనిలోనూ హింసకు స్థానం లేదు. హింస మరింత హింసను మాత్రమే సృష్టిస్తుంది. అది శాంతికి ఎప్పటికీ శాశ్వత పునాది కాదని చరిత్ర మనకు పదేపదే తెలియజేసింది. ” అని దలైలామా స్పష్టం చేశారు. ప్రపంచ ఐక్యతకు టిబెట్ బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామా పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు శాంతి కోసం కృషి చేయాలని కోరారు. పశ్చిమాసియా సహా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న హింస, సంఘర్షణలు త్వరగా ముగియాలని ఆకాంక్షించారు. “పశ్చిమాసియా, రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న సంఘర్షణలకు శాశ్వత పరిష్కారం చర్చలు, దౌత్యం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంటుంది. మనమందరం తోబుట్టువులమనే అవగాహనతో ఈ సంఘర్షణలను పరిష్కరించుకోవాలి.” అని దలైలామా హితవు చెప్పారు.
కొద్ది రోజుల క్రితం రోమ్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన పామ్ సండే ప్రార్థనల సందర్భంగా పశ్చిమాసియా సంక్షోభం గురించి పోప్ లియో-14 పరోక్షంగా స్పందించారు. యుద్ధం చేసేవారి ప్రార్థనలను దేవుడు (యేసు క్రీస్తు) ఆలకించడని తెలిపారు. పైగా ఆ ప్రార్థనలను తిరస్కరిస్తాడని చెప్పారు. పీడితుల పక్షాన దేవుడు నిలుస్తాడని తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా శాంతికి పిలుపునిచ్చారు.
“సోదర సోదరీమణులారా మన దేవుడు యేసు శాంతికే రాజు. ఆయన యుద్ధాన్ని తిరస్కరిస్తాడు. యుద్ధాన్ని సమర్థించుకోవడానికి యేసును ఎవరూ ఉపయోగించుకోలేరు. జీసస్ యుద్ధం చేసేవారి ప్రార్థనలను వినడు. వాటిని తిరస్కరిస్తాడు. పశ్చిమాసియాలోని క్రైస్తవుల కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారు ఈ పవిత్ర దినాల ఆచారాలను పాటించలేకపోతున్నారు.” అని పోప్ లియో-14 పేర్కొన్నారు.

More Stories
పశ్చిమ ఆసియా దేశాలతో స్థానిక కరెన్సీలలో భారత్ వాణిజ్యం?
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ మిలాఖత్
చత్తీస్‌గఢ్ ఇక నక్సల్స్ రహిత రాష్ట్రం