పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరల పట్ల ఆందోళన చెందుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లీటరు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 13 రూపాయల నుంచి 3రూపాయలకి తగ్గించింది. లీటరు డీజిల్‌పై 10 రూపాయలుగా ఉన్న సుంకాన్ని సున్నాకు తగ్గించింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న భారీ నష్టాలను భర్తీ చేయడానికి ఈ తగ్గింపు ఉపయోగపడనుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటింది. ఈనేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరల భారాన్ని ప్రజల పైకి బదిలీ చేయకుండా కేంద్ర తీసుకున్న ఈ చర్య కొంతమేరకు ఉపకరించే అవకాశముుంది.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ వినియోగదారులకు వెంటనే ఉపశమనం లభించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరకపోయినప్పటికీ భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఈ నిర్ణయం కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి.
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్ పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) షేర్లు భారీ లాభాలను నమోదు చేశాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వల్ల ఇంధన విక్రయాలు పెరగడమే కాకుండా, ఈ సంస్థల మార్జిన్లు కూడా మెరుగుపడే అవకాశం ఉండటంతో పెట్టుబడిదారులు వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది చమురు రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.
దీనిపై స్పందిస్తూ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చమురు కంపెనీలు ఎదుర్కొంటున్న భారీ నష్టాలను (పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ. 24, డీజిల్‌పై లీటరుకు రూ. 30గా అంచనా) భర్తీ చేయడానికి ప్రభుత్వం పన్ను రాబడిపై గణనీయమైన భారాన్ని మోసిందని పేర్కొన్నారు.
“అంతర్జాతీయ ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ సమయంలో చమురు కంపెనీల (పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ. 24, డీజిల్‌పై లీటరుకు రూ. 30) అత్యధిక నష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం తన పన్ను రాబడిపై భారీ భారాన్ని మోసింది. అదే సమయంలో, పెట్రోల్, డీజిల్ అంతర్జాతీయ ధరలు విపరీతంగా పెరగడంతో, విదేశాలకు ఎగుమతి చేసే ఏ రిఫైనరీ అయినా ఎగుమతి పన్ను చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి, ఎగుమతి పన్ను విధించబడింది” అని తెలిపారు.
“అత్యంత సమయోచితమైన, సాహసోపేతమైన, దూరదృష్టితో కూడిన ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు నా కృతజ్ఞతలు” అని ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

More Stories
ఖార్గ్ ద్వీపం కోసం అమెరికా, ఇరాన్ సేనల మోహరింపు
ఆపరేషన్ సిందూర్‌పై వివేక్ అగ్నిహోత్రి సినిమా
పశ్చిమ ఆసియా సంక్షోభంపై ప్రభుత్వంకు ముస్లిం ఎంపీ మద్దతు!