ఆంగ్లికన్ చర్చిలో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. సారా ములాలీ కాంటర్బరీకి తొలి మహిళా ఆర్చ్‌బిషప్‌గా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం కాంటర్బరీ కేథడ్రల్‌లో జరిగిన దీక్షా కార్యక్రమంలో ఆమె అధికారికంగా పదవిలోకి ప్రవేశించారు. శతాబ్దాలుగా శతాబ్దాలుగా కేవలం పురుషులు మాత్రమే ఉన్న ఈ అత్యున్నత పదవిని చేపట్టిన 106వ ఆర్చ్‌బిషప్‌గా సారా నిలిచారు.
క్రీ.శ. 597లో సెయింట్ అగస్టీన్ కాంటర్‌బరీతో ప్రారంభమైన ఈ సంప్రదాయంలో ఇప్పటి వరకు ఉన్న 105 మంది ఆర్చ్‌బిషప్‌లు అందరూ పురుషులే కావడం గమనార్హం. దాదాపు 1,400 సంవత్సరాల చరిత్రలో ఒక మహిళ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. 63 ఏళ్ల సారా ములాలీ గతంలో నర్సింగ్ రంగంలో విశేష సేవలందించారు. మహిళలను చర్చిలో ఉన్నత స్థానాలకు అనుమతించినప్పటికీ, అత్యున్నత స్థాయి అయిన ఆర్చ్‌బిషప్ పదవిని ఇప్పుడే మహిళ అధిరోహించడం విశేషం.
ఈ కార్యక్రమానికి వేల్స్ యువరాజు విలియం, ఆయన భార్య కేథరీన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో పాటు సుమారు 2,000 మంది హాజరయ్యారు. కాంటర్బరీ ప్రాంతానికి చెందిన నర్సులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆంగ్లికన్ కమ్యూనియన్ ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా విశ్వాసులను కలిగిన స్వతంత్ర చర్చిల సమూహంగా కొనసాగుతోంది.

More Stories
అమెరికా 15-సూత్రాల శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్!
యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌పై ఇరాన్ క్షిపణి ప్రయోగం!
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు తొలగిస్తేనే చర్చలు