ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులోఎ1గా కేటీఆర్ 

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులోఎ1గా కేటీఆర్ 
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎ1గా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎ2గా ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరును చేర్చింది. అలాగే ఎ3గా హెచ్‌ఎండిఎ మాజీ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్ రెడ్డి, ఎ4గా స్పోర్ట్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఎ5గా యుకెకు చెందిన ఎఫ్‌ఇఒ కంపెనీని పే ర్కొంది.  నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఎసిబి ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా -ఈ రేసింగ్ కోసం దాదాపు రూ.55 కోట్ల ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థల కు బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ.  క్యాబినెట్ అనుమతి లేకుండానే నిధులు విడుదల చేయడం. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా విదేశీ కరెన్సీలో చె ల్లింపులు జరపడం, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నిధులు బదిలీ చేయడం వంటి అంశాలపై ఎసిబి కేసు నమోదు చేసింది. 
 
ఫార్ము లా ఈ రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్‌ఎండిఎ ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బిఐ అ నుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఫిర్యాదు మేరకు ఎసిబి కేసు నమోదు చేసి పలుమార్లు విచారణ చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని ఏసీబీ పలు దఫాలుగా విచారించగా, ఛార్జిషీట్​లో మరో ఇద్దరిని చేర్చింది.
ఏ-1గా కేటీఆర్, ఏ-2గా అర్వింద్ కుమార్, ఏ-3గా బి.ఎల్.ఎన్.రెడ్డి, ఏ-4​గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్, ఏ-5గా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఉంది. దాఖలు చేసిన అభియోగపత్రంలో పలు కీలక అంశాలను ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.  ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఏస్‌ జెన్‌నెక్స్ట్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి రూ.45 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు రావడం, క్విడ్‌ ప్రోకోలో భాగమేనని పొందుపరిచినట్టు తెలుస్తోంది.

కాగా ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి 2024 డిసెంబర్‌ 18న ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీని ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. ఈ మేరకు అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డి, కేటీఆర్‌లను ఈడీ, ఏసీబీ అధికారులు విచారించారు. ఛార్జిషీట్​లో కేటీఆర్‌ తదితరులు నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యారని, ఇతరులకు లాభం కలిగించేలా ప్రవర్తించారని ఏసీబీ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం.