పెట్రోలియం, విద్యుత్, ఎరువులు వంటి కీలక రంగాలలోని పరిస్థితులపై చర్చిస్తూ దేశవ్యాప్తంగా నిత్యావసరాల కొరత లేకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇంధన మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనించాలన్న సూచించారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని మోదీ సీనియర్ మంత్రులతో ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జైశంకర్, రామ్మోహన్ నాయుడు, హర్దీప్ సింగ్ పురి, సర్బానంద సోనోవాల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ హాజరయ్యారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మరోవైపు గ్యాస్ పంపిణీని క్రమబద్ధీకరించడానికి, సరఫరా ఒత్తిళ్లను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సిటీ గ్యాస్ ప్రాజెక్టుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిస్తూనే, కీలక రంగాలకు వాణిజ్య ఎల్‌పిజి కేటాయింపులను పెంచింది.
అత్యవసర సమావేశంలో మంత్రి వర్గంతో చర్చించిన మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతానికి మధ్యంతర చర్యల్లో భాగంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను పెంచింది. విద్యా కేంద్రాలు, ఆస్పత్రులకు గ్యాస్ పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. గృహోపయోగానికి, కమర్షియల్ వినియోగదారులకు కొత్తగా పీఎన్‌జీ (పైప్‌డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
దేశవ్యాప్తంగా సులభమైన లాజిస్టిక్స్, స్థిరమైన సరఫరా, సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థలను కొనసాగించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పాయి. కొరతను నివారించడం, సేవలను స్థిరంగా ఉంచడం కీలక ప్రాధాన్యతలుగా చూస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రపంచ ఇంధన మార్కెట్‌లో ఏవైనా మార్పులు వస్తే వేగంగా స్పందించేందుకు నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని తెలిపాయి.
మరోవైపు గ్యాస్ పంపిణీని క్రమబద్ధీకరించడానికి, సరఫరా ఒత్తిళ్లను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సిటీ గ్యాస్ ప్రాజెక్టుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిస్తూనే, కీలక రంగాలకు వాణిజ్య ఎల్‌పిజి కేటాయింపులను పెంచింది.
పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్జి) సరఫరాను పెంచేందుకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ దరఖాస్తులను 10 రోజులలోపు పరిష్కరించాలని పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పేసో) ఆదేశించింది. ఎల్పీజీపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, పీఎన్‌జీకి మారాలని పట్టణ, నగరాల్లోని వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు సూచించింది. వినియోగదారులు, పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్రం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం పరిశీలిస్తోందని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

More Stories
వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్ ‘హైప్డ్ సంవాదిని’!
ఢిల్లీలో యూఎన్ఐ కార్యాలయం మూసివేతపై పీఈసీ ఆందోళన
ఆర్ఎస్ఎస్పై అమెరికా నివేదిక పట్ల మేధావుల ఆగ్రహం