* ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నాంది
రాబోయే విద్యా సంవత్సరం దృష్టి లో ఉంచుకుని, బడి ఈడు బాల బాలికలకు ఆ ఆ లు దిద్ధించి ఆశీర్వదించాల్సిందిగా పెద్దలను కోరారు. మన సంప్రదాయంలో అక్షరాభ్యాసం కూసు విద్య అంటారని చెబుతూ ఈ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు .
“సామాజిక సమగ్రత స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్థానిక కమ్యూనిటీలు, ఆలయ అర్చకులు, స్వచ్ఛంద సంస్థలు,వేద పాఠశాలలు, వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఈ కార్యక్రమం విస్తృతంగా జరుగుతోంది” అని స్టేట్ కో-ఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ, రాబోయే మే, జూన్ నెలల్లో చిన్నారులను పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రోత్సహిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు తరుపున దేవాలయాలను కేంద్రంగా చేసుకుని విద్యా దానాన్ని విస్తరించే ఈ ప్రయత్నం సమాజంలో మంచి మార్పు రావాలని ధార్మిక ప్రముఖులు ఆశిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో కొనసాగుతున్న ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం, ఇప్పటికే విశేష స్పందనతో విజయవంతమైన కార్యక్రమంగా నిలుస్తోంది.

More Stories
భక్తుల నమ్మకాన్ని కాపాడాలి… నాణ్యమైన ప్రసాదాన్ని అందించాలి
వ్యక్తి నిర్మాణంతో వసుదైక కుటుంబమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధార్మిక సదస్సు