పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో, వియత్నాం శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఇథనాల్-మిశ్రమ గ్యాసోలిన్ వినియోగానికి పూర్తిగా మారనుంది. ఈ మేరకు వియాత్నాం ప్రభుత్వం ఒక పత్రాన్ని విడుదల చేసింది. యుద్ధం ”ఇంధన ధరలలో గణనీయమైన హెచ్చుతగ్గులకు కారణమైంది,
ఇంధన దిగుమతులపై ఆధారపడిన దేశాలకు అనేక సవాళ్లను సృష్టించింది, వియత్నాంతో సహా అనేక దేశాల ఇంధన భద్రతకు ప్రమాదాలను పెంచింది” అని ఆ పత్రం పేర్కొంది. మూడు వారాల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి వియత్నాంలో ఇంధన ధరలు గణనీయంగా పెరిగాయి.
ప్రముఖ ఇంధన వ్యాపారి పెట్రోలిమెక్స్ డేటా ప్రకారం, గ్యాసోలిన్ ధరలు 50 శాతం పెరిగాయి, డీజిల్ ధరలు 70 శాతం పెరిగాయి. ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్ గురువారం సంతకం చేసిన ప్రభుత్వ ఆదేశం ప్రకారం, వచ్చే నెల నుండి 10 గ్యాసోలిన్‌ను 10 శాతం బయోఇథనాల్‌ను కలిగి ఉన్న మిశ్రమాన్ని ఉపయోగించనుంది. ఇది గతంలో జూన్ 1వతేదీన ప్రారంభించాలని నిర్ణయించినా ముందుగానే అమలు చేయనుంది.
దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాలని అధికారులను కోరింది, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి, వినియోగాన్ని విస్తరించాలని పిలుపునిచ్చింది. అలాగే, 2026 మూడవ త్రైమాసికం నుండి 20వాట్ల నుండి 60వాట్ల ఇంక్యాండెసెంట్ లైట్ బల్బుల వినియోగాన్ని వియత్నాం పూర్తిగా తొలగిస్తుందని కూడా ఆ పత్రం తెలిపింది.

More Stories
రాష్ట్రాలకు మరో 20 శాతం వాణిజ్య గ్యాస్ కేటాయింపులు
ఎల్పీజీ బుకింగ్స్ తగ్గుముఖం.. ఉత్పత్తి 40 శాతం పెంపు
పవర్/ప్రీమియం పెట్రోల్ ధరలు పెంపు