అదే సమయంలో రష్యా నుంచి ముడి చమురును మోసుకొచ్చిన మరో భారీ నౌక ఆక్వా టైటాన్ కూడా మంగళూరు తీరానికి చేరుకుంది. ఈ చమురును సింగిల్-పాయింట్ మూర్తింగ్ వ్యవస్థ ద్వారా పైప్‌లైన్ల సాయంతో మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎం ఆర్ పీఎ ల్)కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి చైనాకు వెళ్లాల్సిన నౌక ప్రస్తుతం తీరానికి దూరంగా లంగరు వేసి ఉంది. పైప్‌లైన్‌ల ద్వారా ముడి చమురును రిఫైనరీకి తరలిస్తారు.
ఇంతకుముందు చైనాకు వెళ్లాల్సిన కనీసం ఏడు ట్యాంకర్లను ఇప్పుడు భారతదేశానికి మళ్లిస్తున్నారు. ఆక్వా టైటాన్ నౌక కూడా, మొదట చైనా ఓడరేవును తన గమ్యస్థానంగా పేర్కొన్న తర్వాత ఆగ్నేయాసియాలో తన మార్గాన్ని మార్చుకుంది. మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరగకుండా ఉండేందుకు, సముద్రంలో ప్రయాణంలో ఉన్న రష్యా ముడి చమురు విక్రయాలకు అమెరికా వెసులుబాటు కల్పించడంతో భారత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.
మరోవైపు, అత్యంత ప్రమాదకరమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించి ‘నందా దేవి’, ‘శివాలిక్’ అనే రెండు భారత ఎల్పీజీ ట్యాంకర్లు గుజరాత్‌లోని వాడినార్, ముంద్రా పోర్టులకు సురక్షితంగా చేరుకున్నాయి. ప్రస్తుతం పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సుమారు 611 మంది భారతీయ నావికులతో కూడిన 22 నౌకలు ఉన్నట్లు సమాచారం. ఈ నౌకల భద్రతను, తాజా పరిణామాలను డీజీ షిప్పింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇరాన్, ఇతర మధ్యప్రాచ్య దేశాల మధ్య నెలకొన్న వివాదాల వల్ల చమురు సరఫరాకు ఆటంకాలు కలగకుండా భారత్ తన దౌత్య, వాణిజ్య సంబంధాలను సమర్థవంతంగా వినియోగిస్తోంది. ఇంధన నిల్వలను పటిష్ఠం చేసుకోవడం ద్వారా దేశీయంగా ధరల స్థిరీకరణకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది.

More Stories
రాష్ట్రాలకు మరో 20 శాతం వాణిజ్య గ్యాస్ కేటాయింపులు
ఇథనాల్ మిశ్రమ గ్యాసోలిన్ వైపుకు వియాత్నం
ఎల్పీజీ బుకింగ్స్ తగ్గుముఖం.. ఉత్పత్తి 40 శాతం పెంపు