భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఐఎ), మైగొవ్. (MyGov) సంయుక్తంగా ఆధార్ వినియోగదారులకు ఒక తీపి కబురు అందించాయి. ఇకపై మీ ఆధార్ కార్డును ఫిజికల్ కాపీగా వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అత్యవసర సమయాల్లో మీ మొబైల్ నుంచే వాట్సాప్ ద్వారా క్షణాల్లో ఇ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
ఈ సేవను పొందడానికి వినియోగదారుల వద్ద ఈ క్రింది వివరాలు ఉండాలి:
- మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానించబడి ఉండాలి.
- మీకు యాక్టివ్ డిజిలాకర్ ఖాతా ఉండాలి.
- మీ 12 అంకెల ఆధార్ నంబర్ తెలిసి ఉండాలి.
డౌన్‌లోడ్ చేసుకునే విధానం
- మొదట మీ ఫోన్‌లో MyGov హెల్ప్‌డెస్క్ నంబర్ +91-90131-51515 ను సేవ్ చేసుకోండి.
- వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు ‘హై’ అని మెసేజ్ పంపండి.
- అక్కడ వచ్చే ఆప్షన్లలో ‘డిజిలాకర్ సేవలు’ ను ఎంచుకోండి.
- ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చేఓటిపి ని ధృవీకరించిన వెంటనే, మీ ఇ-ఆధార్ పిడిఎఫ్ రూపంలో మీకు అందుతుంది.
ఈ సేవ పూర్తిగా ఉచితం మాత్రమే కాదు, చట్టబద్ధంగా అన్ని చోట్లా ఒరిజినల్ ఆధార్ లాగే చెల్లుబాటు అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

More Stories
నిందితుల ఫోటోలు వెంటనే సోషల్ మీడియాలో.. సుప్రీం ఆందోళన
ఎన్నికల ప్రకటనలకు ఎంసిఎంసి ధ్రువీకరణ తప్పనిసరి
పెళ్లి చేసుకుంది జీవిత భాగస్వామిని.. సేవకురాలిని కాదని