మరోవైపు, పశ్చిమాసియాలో సైనిక చర్యలను క్రమంగా తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాము చేపట్టిన సైనిక చర్యలు అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాయని పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం, లాంచర్లు పూర్తిగా నిర్వీర్యం చేయడం, రక్షణ రంగ మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయడం తమ లక్ష్యంలో భాగమని చెప్పారు.
ఇలా ఉండగా, ఇరాన్‌పై భూతల యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధ రంగంలోకి ఉత్తర అరేబియా సముద్రంలో యుద్ధ క్షేత్రంలోకి 2,000 మంది నావికులతో అమెరికా యుద్ధ విమానాల వాహకనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలి వచ్చేవారం ప్రవేశించనున్నది. 50,000 టన్నుల బరువైన ఈ నౌక ప్రవేశంతో ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం భవిష్యత్తు తేలిపోతుంది.
ప్రస్తుతం దక్షిణ హిందూ మహాసముద్రంలో శ్రీలంకకు దక్షిణం వైపున ఉన్న ట్రిపోలి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో మోహరించి ఉన్న యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్‌కు మరింత బలం చేకూర్చనున్నది. 844 అడుగుల పొడవుండే యూఎస్‌ఎస్ ట్రిపోలిపైన ఎఫ్-35, ఎంవీ-22 అస్ప్రీ, ఎంహెచ్60ఎస్ సీహాక్ హెలికాప్టర్లు ఉంటాయి. మార్చి 22-23 తేదీల్లో ఈ నౌక యుద్ధ క్షేత్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆంక్షలకు గురైన ఇరాన్ చమురును చైనా చౌకగా నిల్వ చేస్తోందని బిసెంట్ తెలిపారు. ఆ చమురును ప్రపంచ మార్కెట్‌కు అందించడం ద్వారా సరఫరా పెంచాలని పేర్కొ న్నారు. అయితే ఈ అనుమతి కేవలం తాత్కాలికమేనని, ఇప్పటికే సముద్రంలో ఉన్న చమురుకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. కొత్తగా చమురు కొనుగోలు లేదా ఉత్పత్తికి అనుమతి లేదని తెలిపారు.
ఇరాన్‌కు ఈ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా వినియోగించుకోలేనట్లు పరిమితులు కొనసాగుతాయని, ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడి యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమెరికా ఇప్పటికే అదనంగా 440 మిలియన్ బ్యారెల్స్ చమురును మార్కెట్‌లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోందని బెసెంట్ తెలిపారు. దేశీయ ఉత్పత్తి పెంపుతో ఇంధన భద్రతను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభానికి ముందు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర, ఈ వారం 119.50 డాలర్ల వరకు పెరిగింది. ఇదే సమయంలో అమెరికాలో పెట్రోల్ ధరలు కూడా గ్యాలన్‌కు 3 డాలర్ల నుంచి 3.99 డాలర్లకు పెరిగాయి.

More Stories
`భారత్ లో మతపరమైన హింస’ నివేదిక అమెరికాకే గొడ్డలిపెట్టు!
విశ్వవ్యాప్తంగా ప్రతిష్ట పొందలేకపోతున్న భారతీయ వంటకాలు
జ్యోతిష్కుడి వివాదంలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాజీనామా