అమెరికా యుద్ధ విమానాలకు శ్రీలంక అనుమతి నిరాకరణ

అమెరికా యుద్ధ విమానాలకు శ్రీలంక అనుమతి నిరాకరణ
ఇరాన్‌తో యుద్ధం తమ దేశానికి చెందిన రెండు యుద్ధ విమానాల్ని ల్యాండ్ చేసేందుకు అంగీకరించాలంటూ అమెరికా చేసిన విజ్ఞప్తిని శృఖబ్జా తోసిపుచ్చింది. తాము యుద్ధ సమయంలో తటస్థ వైఖరి అవలంభిస్తామని అమెరికాకు స్పష్టం చేసిన్నట్లు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే శుక్రవారం పార్లమెంట్‌లో ప్రకటించారు.  దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా ప్రత్యేక రాయబారి సెర్గియో గోర్‌తో సమావేశమైన మరుసటి రోజు దిసనాయకె ఈ ప్రకటన చేశారు.
ఆఫ్రికాలోని జిబూటీలోని స్థావరం నుండి ఎనిమిది  విధ్వంసక క్షిపణులతో కూడిన రెండు అమెరికా యుద్ధ విమానాలు మార్చి 4, 8 తేదీల్లో శ్రీలంకకు రావడానికి అనుమతి కోరారు.  అయితే ఆ అభ్యర్థనలను తిరస్కరించామని ఆయన చెప్పారు. అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ  తాము తటస్థతను కొనసాగించాలనుకున్నామని, తాము లొంగిపోమని స్పష్టం చేశారు.  పశ్చిమాసియా యుద్ధం సవాళ్లను విసురుతోందని, కానీ తటస్థంగా ఉండేందుకు సాధ్యమైన అన్ని చర్యలు చేపడతామని తేల్చి చెప్పారు. 
 
ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ వాటిని వ్యూహాత్మకంగా వాడేందుకు శ్రీలంకకు తీసుకురావాలనుకుంది.  ఇందుకోసం ఆయుధాలతో కూడిన ఈ విమానాల్ని శ్రీలంకలోని మట్టాలా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేస్తామని, ఇందుకు అనుమతించాలని అమెరికా కోరింది.   మధ్యాసియా యుద్ధం సమయంలో ఎంత ఒత్తిడి ఎదురైనా తటస్థంగానే ఉన్నామని, ఈ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.  
అమెరికాతో చర్చల సందర్భంగా సముద్ర మార్గాల రక్షణ, పోర్టుల భద్రత, వ్యాపార, వాణిజ్య రంగాల్లో సహకారం వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు దిస్సనాయకె తెలిపారు.   ఇక, ఈ విమానాలు ల్యాండ్ అవ్వాల్సిన మార్చి 4న ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికన్ టోర్పిడోడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనలో 84 మంది మరణించారు. 32 మందిని శ్రీలంక నేవీ రక్షించింది. ఈ ఘటన శ్రీలంక సముద్ర జలాల సరిహద్దులోనే జరిగింది. 

మరోవైపు ఇరాన్ యుద్ధం ప్రభావం శ్రీలంకపై కూడా పడింది. ముఖ్యంగా చమురుకు ఇబ్బందులు పడుతోంది. అందుకే అక్కడ వారానికి 4 రోజులే పనిదినాలుగా ప్రకటించింది. ఇప్పటివరకు శ్రీలంకలో ఐదు రోజులే పని దినాలుగా ఉండేవి. శని, ఆదివారాల్లో సెలవులుండేవి. కానీ, ఇప్పుడు బుధవారం కూడా సెలవు దినంగా ప్రకటించింది.