తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వాల ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ, ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం రూ.47,267 కోట్లు, తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా పేర్కొన్నారు.
రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతమని ప్రకటించారు. ష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల పథకానికి రూ.50,713 కోట్లను కేటాయించినట్లుగా తెలిపారు. రైరైతుకుటుంబాలకు భరోసాకు పథకానికి ఈ బడ్జెట్‌లో రూ.14,861 నిధులు కేటాయించినట్లు వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.344 కోట్లను ప్రతిపాదించారు. కూలీల కొరత, మానవ వనరులు తగ్గిపోతున్న దృష్ట్యా ట్రాక్టర్లు, వరి నాటు యంత్రాలు, కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు, పిచికారీ యంత్రాలు ప్రత్యేకించి అత్యాధునిక ఏఐ ఆధారిత డ్రోన్లపై కూడా 40 శాతం రాయితీ ఇచ్చేందుకు ఈ నిధులు అత్యంత దోహదపడనున్నాయి.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమాను కల్పించనున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించారు. జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ పధకం కోసం రూ. 4,000 కోట్లు కేటాయించారు. ఇయర్ నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కూడా అమలు చేస్తారు.
ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు 26,674 కోట్లు, వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు, విద్యుత్ శాఖకు 21,285 కోట్లు, పౌరసరఫరాల శాఖకు 7,366 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,529 కోట్లు, వైద్య శాఖకు 13,679 కోట్లు, కార్మిక శాఖకు 998 కోట్లు, పర్యాటక రంగానికి 1,224 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,937 కోట్లు, బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.3,769 కోట్ల చొప్పున కేటాయించారు.
అదేవిధంగా పట్టణాభివృద్ధి, పురపాలక శాఖకు రూ.17,907 కోట్లు, న్యాయశాఖకు రూ.2,367 కోట్లు, రవాణా శాఖకు రూ.12,759 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ.33,688 కోట్లు, ఐటీ శాఖకు రూ.875 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.3,490 కోట్లు, చేనేతకు రూ.258 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.7,430 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు రూ.22,615 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి రూ.6 వేల కోట్లు, శాంతిభద్రతలకు రూ.11,907 కోట్లు, గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్ల చొప్పున కేటాయించినట్లు భట్టి తెలిపారు.

More Stories
తెలంగాణ బడ్జెట్ అత్యంత నిరాశాజనకం
స్వామి స్మరణానందకు చిరంజీవి ఉగాది పురస్కారం
తెలంగాణాలో ఆర్ఎస్ఎస్ శతాబ్దిలో 375 కొత్త శాఖలు