ఇందుకోసం అవసరమైతే నావికాదళంను కూడా వాడాలని నిర్ణయించింది. ఇప్పట్లో యుద్ధం ఆగే సూచనలు కనిపించకపోవడంతో నేరుగా భారత నావికాదళం రంగంలోకి దిగబోతుంది. భారత చమురు అవసరాలు తీరాలంటే హోర్ముజ్ జలసంధి వద్ద చిక్కుకున్న నౌకలు భారత్ కు తిరిగి రావడం చాలా కీలకం. యుద్ధ సంక్షోభం కారణంగా ఆ నౌకల ప్రయాణం కష్టతరంగా మారింది. ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో ఆ నౌకల లొకేషన్‌లను భారత్ గుర్తించింది. 22 నౌకల్లో 20 నౌకలు చమురు సరఫరాకు సంబంధించినవే. ఇవన్నీ కార్గో షిప్స్. వీటిలో భారీ స్థాయిలో చమురు నిల్వలున్నాయి. ఈ నౌకలన్నింటిలో కలిపి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జీ, 3.21 లక్షల టన్నుల ఎల్పీజీ, 16.76 లక్షల క్రూడాయిల్ నిల్వలున్నాయి. ఇప్పుడు కేంద్రం వీటిని గుర్తించింది.
ఆ తర్వాత ఈ నౌకల తరలింపు ఉంటుంది. వీటికి రక్షణ కూడా అవసరం. ఈ మొత్తం ఆపరేషన్‌కు అనేక వ్యవస్థలు కలిసి పని చేయాలి. పోర్టులు, షిప్పింగ్, జలవనరుల శాఖ, నేవీ ఆపరేషన్స్ విభాగం, పెట్రోలియం, చమురు మంత్రిత్వ శాఖ, సమాచార కేంద్రాలు వంటివి కలిసి పని చేస్తేనే నౌకల్ని ఇండియా తీరానికి చేర్చడం వీలవుతుంది. ఈ నౌకలు అన్నింటిలో కలిపి 611 మంది పని చేస్తున్నారు. మన నౌకలు హోర్ముజ్ జలసంధిలో ముందు వరుసలోనే ఉన్నాయి.
ఇటీవలే శివాలిక్, నందా దేవి, జగ్ లాడ్కి వంటి నౌకలు భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. వీటికి కూడా భారత నావికాదళం రక్షణగా నిలిచింది. హోర్ముజ్ వద్ద నిలిచిపోయిన నౌకల్లో్ని సిబ్బంది కాకుండా మొత్తంగా వివిధ విభాగాల్లో, దేశాల్లో పని చేసే భారతీయులు చాలా మందే ఉన్నారు. దాదాపు 23,000 భారతీయ నౌకాయన సిబ్బంది ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. 658 పడవలు ఇంకా చాలా చోట్ల నిలిచిపోయాయి.

More Stories
ఉగ్ర కుట్ర చేధింపు.. పాక్‌కు సాయం చేస్తున్న ఇద్దరు అరెస్ట్
యువ గ్రాడ్యుయేట్లలో 40 శాతం నిరుద్యోగులే
బెంగాల్ లో 19 సీనియర్ అధికారులపై ఇసి వేటు