పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ముగింపునకు చర్చలు, దౌత్య మార్గాల అవశ్యకతను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రస్తావించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ చెప్పారు. యూరోపియన్ యూనియన్ నేతల ఆహ్వానం మేరకు బ్రస్సెల్‌లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.
“మా విదేశాంగ మంత్రి జై శంకర్ బ్రస్సెల్స్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయూ విదేశాంగ వ్యవహరాల కౌన్సిల్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఈయూ ఉన్నత ప్రతినిధి, ఉపాధ్యక్షురాలు కాజా కల్లాస్ ఆయనను ఆహ్వానించారు. ఈ సమావేశంలో భారత్-ఈయూ సంబంధాలపై చర్చించడంతో పాటు ప్రపంచ సవాళ్లపై ముఖ్యంగా పశ్చిమాసియాలోని పరిస్థితిపై, ఇంధన భద్రతపై దాని ప్రభావాలతో సహా చర్చించారు” అని ఆయన తెలిపారు.
“ఇందులో జైశంకర్‌తో పాటు యూరోపియన్ యూనియన్‌లోని ఇతర మంత్రులు, ఈయూలోని వివిధ దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సంక్షోభాన్ని త్వరగా ముగింపు పలకడానికి చర్చలు, దౌత్య మార్గాలను అనుసరించాల్సిన అవసరాన్ని మంత్రులు చర్చించారు.” అని రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. అటు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రస్సెల్స్‌లో పర్యటించారు. బ్రస్సెల్స్‌లో పర్యటనను విజయవంతంగా ముగించానంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే ఈయూ- భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద సహా పది కీలక అంశాలపై చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. “యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాల మండలి సమావేశం, ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఈయూ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌లతో భేటీ, ఈయూ ఉపాధ్యక్షురాలు కాజా కల్లాస్తో చర్చలు జరిగాయి. ఈయూ ప్రతినిధులను కూడా కలుసుకుని పలువురితో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపాము.” అని పోస్ట్ చేశారు.
కాగా, దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. ఇంధన కొరతపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి అధికంగా కొనుగోలు చేయడం వంటివి చేయవద్దని ఆమె కోరారు. సహజ వాయువు సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సుజాత శర్మ తెలిపారు.

More Stories
కేంద్ర మంత్రి కుమార్తెను ఎప్స్టీన్తో లింక్ పోస్టులు తొలగించాలి!
లోక్‌సభలో 8 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత
రా, ఆర్ఎస్ఎస్లపై ఆంక్షలు… అమెరికా నివేదికపై భారత్ కన్నెర్ర