వనపర్తి జిల్లా గ్రామంలో ఒక క్రైస్తవుడు లేకపోయినా చర్చికి అనుమతి!

వనపర్తి జిల్లా గ్రామంలో ఒక క్రైస్తవుడు లేకపోయినా చర్చికి అనుమతి!

ఆ గ్రామంలో ఒక్క క్రైస్తవుడు కూడా లేదు. కానీ ఆశ్చర్యకరంగా ఆ గ్రామంలో చర్చి నిర్మించడానికి ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఓ వ్యక్తికి అనుమతి ఇచ్చారు. ఆ వ్యక్తికి ఆ గ్రామంతో సంబంధం లేదు. ఆ గ్రామంతో సంబంధం లేని వ్యక్తి కొన్న భూమిలో చర్చ్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  కేవలం 15 రోజుల వ్యవధిలో, గ్రామంలో ఎటువంటి అభిప్రాయ సేకరణ జరపకుండా, గ్రామస్థులను సంప్రదింపకుండా ఆఘమేఘాహాల మీద అనుమతి ఇచ్చినట్లు కనిపిస్తున్నది. 

వనపర్తి జిల్లాలోని వనపర్తి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఈ విస్మయకర పరిణామం చోటుచేసుకుంది.  సర్వే నంబర్ 71/a5/2లో చర్చి నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు. ఈ భూమి వల్లేపు ఐజాక్ అనే వ్యక్తికి చెందింది. అయితే, ఆయన ఈ గ్రామానికి చెందిన నివాసి కాదు.  ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, ఈ గ్రామంలో క్రైస్తవ మతానికి చెందిన ఒక్క వ్యక్తి కూడా నివసించడం లేదు.

 గ్రామానికి సంబంధం లేని ఒక బయటి వ్యక్తి, గ్రామస్తుల ఎవరి అనుమతి లేకుండానే చర్చిని నిర్మించడానికి ప్రయత్నిస్తూ, గ్రామంలోని ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించడానికి యత్నిస్తున్నారు. గ్రామం జనాభా స్వరూపాన్ని, ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఈ అనుమతి మంజూరు చేయడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. 

కాబట్టి, దయచేసి ఈ చర్చి నిర్మాణ అనుమతిని రద్దు చేయాలని గ్రామస్తులు అధికారులకు విన్నవించుకుంటున్నారు.  నిబంధనలకు విరుద్ధంగా ఈ అనుమతిని మంజూరు చేసిన సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.