పశ్చిమబెంగాల్‌అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డిజిపిలను బదిలీ చేసిన ఎన్నికల కమిషన్ (ఇసి) తాజాగా మంగళవారం ఇద్దరు జిల్లా అదనపు కార్యదర్శులు (ఎడిజి) సహా 19 సీనియర్ అధికారులపై బదిలీ వేటు వేసింది. బదిలీ అయిన అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, బుధవారం ఉదయం 11.00 గంటలలోపు ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని ఇసి ఆ ప్రకటనలో పేర్కొంది.
ఐపిఎస్ అధికారి రాజేష్ కుమార్ సింగ్‌ను దక్షిణ బెంగాల్ కొత్త అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి)గా, కె.జయరామన్‌ను ఉత్తర బెంగాల్ ఎడిజిగా నియమించారు. వీరు 1997 బ్యాచ్‌కు చెందినవారని ఒక ప్రకటనలో తెలిపింది. వై.ఎస్.జగన్నాథరావు కోల్‌కతా పోలీస్ డిసిపి (సెంట్రల్ )గా నియమితులయ్యారు. అసన్‌సోల్-దుర్గాపూర్, హౌరా, బరాక్‌పూర్, చందన్‌నగర్‌లకు నూతన పోలీస్ కమిషనర్ (సిపి)లను నియమించింది.
పశ్చిమ బర్దమాన్‌లోని అసన్‌సోల్-దుర్గాపూర్‌కు ప్రణవ్ కుమార్ కొత్త సిపిగా నియమితులయ్యారు. హౌరాకు అఖిలేష్ కుమార్ చతుర్వేది సిపిగా నియమితులయ్యారు. ఉత్తర 24 పరగణాలలోని బారక్‌పూర్‌కు అమిత్‌కుమార్ సింగ్ కొత్త సిపిగా, హుగ్లీ జిల్లాలోని చందన్‌నగర్‌లకు సునీల్ కుమార్ యాదవ్ సిపిగా నియమితులయ్యారు. 12 జిల్లాల సూపరింటెండెంట్‌లను కూడా మార్చినట్లు ఇసి ఆ ప్రకటనలో తెలిపింది.
బరాసత్ ఎస్‌పిగా పుష్ప, కూచ్ బెహార్‌కు జస్‌ప్రీత్ సింగ్, బిర్భూమ్‌కు సూర్యప్రతాప్ యాదవ్, హుగ్లీ రూరల్‌కు కుమార్ సన్నీ రాయ్, డైమండ్ హార్బర్‌కు ఇషానీ పాల్, ముర్షిదాబాద్‌కు సచిన్, బసిర్హాత్‌కు అలకనంద భౌవల్, మాల్డాకు అనుపమ్ సింగ్, అన్షుమాన్ సాహా తూర్పు మిడ్నాపూర్ ఎస్‌పిగా, జంగీపూర్ ఎస్‌పిగా సురీందర్ సింగ్‌లు నియమితులయ్యారు. ఇస్లాంపూర్ నూతన ఎస్‌పిగా రాకేష్ సింగ్, పశ్చిమ మేథినీపూర్ (పాత మిడ్నాపూర్) ఎస్‌పిగా పపియా సుల్తానాలు నియమితులయ్యారు.

More Stories
వారణాసిలో గంగా నదిపై ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్
పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం.. సుప్రీం సూచన
ఉగ్రవాద ఆరోపణలపై ఆరుగురు ఉక్రెయిన్ల అరెస్ట్