భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ పర్యటన నుండి తిరిగి వచ్చిన కొద్దీ గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడికి దిగడం పట్ల భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ స్పష్టత ఇచ్చారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ చేపట్టిన ఉన్నత స్థాయి దౌత్య పర్యటనకు ముందే ప్రాంతీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నట్లు అజర్ వెల్లడించారు.
రు. అయితే ఆ సమయం కన్నా ముందే తమ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అందరికీ తెలిసిందే అని అజర్ పేర్కొన్నారు. మోదీ పర్యటనతో సంబంధం లేకుండా సైనిక ఆదేశాల ప్రకారం దాడి జరిగినట్లు ఆయన చెప్పారు. వ్యూహాత్మక అంచనాలు వేసిన తర్వాతే ఇరాన్‌పై అమెరికాతో కలిసి దాడికి దిగినట్లు అంబాసిడర్ రూవెన్ అజర్ చెప్పారు.
దాడి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే, ప్రధాని మోదీ వచ్చి వెళ్లిన తర్వాతే మిలిటరీ ఆపరేషన్ చేపట్టే అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. ఇరాన్‌పై దాడికి, మోదీ పర్యటనకు లింకు ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. తమ ప్రాంతం నుంచి మోదీ వెళ్లిపోయిన తర్వాతే దాడి చేసేందుకు అనుమతి వచ్చినట్లు చెప్పారు.
మోదీ పర్యటన ముగింపునకు, సైనిక చర్య చేపట్టడానికి మధ్య రెండు రోజుల సమయం పట్టిందని, అయితే క్యాబినెట్ నిర్ణయం తర్వాతే దాడికి పాల్పడినట్లు అజర్ చెప్పారు. అమెరికాకు కానీ, ఇజ్రాయెల్‌కు కానీ ఇరాన్‌ను ఆక్రమించాలన్న ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఇరాన్‌లో అంతర్గత మార్పులు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పశ్చిమాసియా ప్రాంతంలో స్థిరత్వాన్ని, భద్రతను కల్పించాలన్నదే ఇజ్రాయెల్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఇరానీ ప్రజలు తమ దేశ విధానాలను, నాయకులను మార్చుకోవాలని ఆయన సూచించారు. నిజానికి ఇరాన్‌లో ఆ మార్పు జరుగుతుందో లేదో తెలియదు అని, కానీ ఇరానీ ప్రజల్లో ప్రభుత్వ మార్పుపై దృష్టిపెట్టేలా చర్యలు చేపడుతామని చెప్పారు. ‘వారి సైనిక స్థావరాలపై దాడికి సంబంధించి ఎలాంటి మార్పు లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
“మేము మూడు లక్ష్యాలతో దాడులు చేశాం. మొదటిది న్యూక్లియర్, ఆ తర్వాత బాలిస్టిక్ క్షిపణి, ఇరాన్ లోపల అణు శక్తి సామర్థ్యాలను తగ్గించడం వంటి మూడు లక్ష్యాలతో ఇరాన్‌పై దాడి చేశాము. వీటిపై ఎలాంటి మార్పు లేదు” అని రూవెన్ అజార్ తెలిపారు. అయితే అమెరికా- ఇజ్రాయిల్ దాడికి ఇరాన్ సైన్యం కచ్చితంగా ఎదురుదాడికి దిగుతుందని తాము ఊహించామని ఆయన చెప్పారు.
జూన్‌లో దాడి చేసినప్పుడు ఇరాన్ సామర్థ్యాలను తగ్గించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రతిదాడిగా ఇప్పుడు ఇరాన్ 12 దేశాలపై దాడి తీవ్రతరం చేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని రూవెన్ అజార్ విమర్శించారు.

More Stories
బంగాల్ సీఎస్, హోంశాఖ కార్యదర్శి, డిజిపిలపై ఈసీ వేటు
యుద్ధ నౌకలు పంపేందుకు ఆస్ట్రేలియా, జపాన్ ట్రంప్ కు మొండిచేయి
కటక్ హాస్పిటల్లో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి