మరోవంక, తాజాగా విడుదలైన నెతన్యాహు వీడియో మరిన్ని అనుమానాలకు కారణం అవుతుంది. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మరణించాడు. అయితే, యుద్ధం మొదలైనప్పటినుంచి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఎలాంటి సమావేశాల్లోనూ కనిపించలేదు.
ఆయన సమావేశాల్లో పాల్గొన్నట్లు, కొన్ని ప్రదేశాల్ని సందర్శించినట్లు పలు ఫొటోలు, వీడియోలు విడుదలయ్యాయి. అయితే, వాటి విషయంలోనూ సందేహాలున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం రోజూ ఏదో ఒక రకంగా మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. పలు సమావేశాలకు హాజరవుతున్నారు. ఇలాంటి సమయంలో నెతన్యాహు కనిపించకపోవడానికి గల కారణాలు ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయన మరణించారా? అని చాలా మంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై భీకరంగానే దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో నెతన్యాహు అధికార నివాసంపై కూడా డ్రోన్ లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మరణించి ఉండొచ్చని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఖండిస్తున్నప్పటికీ, ఈ వాదన నిజమనిపించేలా ఆయన బహిరంగంగా కనిపించడం లేదు.
ఇదే సమయంలో తాజాగా ఇజ్రాయెల్ విడుదల చేసిన ఒక వీడియో సంచలనం రేపుతోంది. ఆ వీడియోలో నెతన్యాహు మాట్లాడారు. కానీ, బాగా గమనిస్తే ఆ వీడియోలో ఆయన చేతికి ఆరు వేళ్లున్నాయి. నిజానికి ఆయన చేతికి ఆరు వేళ్లు లేవు. దీంతో అది ఏఐ వీడియో అని, నెతన్యాహు మరణించి ఉండొచ్చనే అనుమానాలు మొదలయ్యాయి.
ఆయన ఉన్నారని ప్రపంచాన్ని నమ్మించడానికే ఇలా ఏఐ వీడియో విడుదల చేశారని ఇరాన్ అనుకూల విశ్లేషకులు అంటున్నారు. ఏఐ వీడియోల్లో మాత్రమే ఇలా కొన్నిసార్లు మనుషుల చేతికి ఆరు వేళ్లు కనిపించడం చాలాసార్లు చూశామని, అందువల్ల అది ఏఐ వీడియోనే అంటున్నారు. అయితే, దీనిపై ఏఐ చాట్‌బోట్ అయిన గ్రోక్ ఒక సమాధానం చెప్పింది.
వీడియో రికార్డ్ చేసేటప్పుడు కెమెరా యాంగిల్స్, ఫ్రేమింగ్‌లో లోపాల వల్ల అప్పుడప్పుడూ చేతికి ఆరువేళ్లు ఉన్నట్లు కనిపించడం సహజమేనని, ఇది ఒరిజినల్ వీడియోనే అని గ్రోక్ తెలిపింది. ఏదేమైనా నెతన్యాహు బతికి ఉన్నారా లేదా అనే విషయంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ నుంచి స్పష్టత వస్తే, లేకుంటే నెతన్యాహు బయటకు వస్తేనే దీనికి సమాధానం దొరుకుతుంది.
గత నెల ప్రారంభంలో ఇరాన్ ప్రారంభించిన దాడుల్లో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడు మరణించి ఉండవచ్చు లేదా గాయపడి ఉండవచ్చు అనే పుకార్లు వచ్చిన నేపథ్యంలో నేటికీ నెతన్యాహు వాస్తవ పరిస్థితి అస్పష్టంగానే ఉంది. అయితే, టెహ్రాన్‌లోని మీడియా నెట్‌వర్క్‌లు ఈ కధనాలను అతని నివాసం చుట్టూ భద్రత పెంచడం, అమెరికా ప్రతినిధి బృందం ఇజ్రాయెల్ పర్యటన వాయిదా వేయడం వంటి అనేక పరోక్ష సూచికల ఆధారంగా నమ్ముతున్నాయి.

More Stories
ప్రముఖ తమిళకవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ పురస్కారం
మమత సర్కార్ కు కౌంట్ డౌన్ – బెంగాల్ లో ‘మార్పు’ అనే తుపాను
‘హిందూ-సిక్కు ఏకతా’ పంజాబ్ పురోగతికి పునాది