రోహిత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ డ్రగ్స్‌ పార్టీలో కాల్పుల కలకలం

రోహిత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ డ్రగ్స్‌ పార్టీలో కాల్పుల కలకలం
* * ఏలూరు టిడిపి ఎంపీ పుట్ట మహేష్ తో సహా ఆరుగురికి పాజిటివ్

మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్‌ హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ కలకలం సృష్టించింది. పక్కా సమాచారంతో పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 11 మంది పట్టుబడగా, వారిలో ఏలూరు టిడిపి ఎంపీ పుట్టా మహేశ్‌, మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి కూడా ఉన్నారు. తొలుత నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో ఎంపీ పుట్టా మహేశ్‌కు నెగిటివ్ వచ్చినప్పటికీ, తదుపరి నిర్వహించిన రక్త పరీక్షల్లో డ్రగ్స్ వాడినట్లు పాజిటివ్ వచ్చిందని ఈగల్‌ ఎస్‌పి గిరిధర్ రావు తెలిపారు. 

ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మరో నలుగురికి కూడా పాజిటివ్ వచ్చినట్లు  ధ్రువీకరించారు. రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ సోదాల్లో ఒక మహిళతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించడంతో, ఈ ఉదంతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు రాగానే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిద్ మిశ్రా పోలీసులను భయపెట్టడానికి కాల్పులు జరిపాడు. నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు.
అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. తుపాకీ పైలట్ రోహిత్‌ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు.  ఇక ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.   రితేష్ రెడ్డి, నమిద్ మిశ్రా, కౌశిక్‌ రవి, అర్జున్‌ రెడ్డిలకు కూడా పాజిటివ్‌ వచ్చింది. పార్టీలో పట్టుబడిన మహిళ  కౌశిక్‌ రవితో కలిసి  వచ్చింది. డ్రగ్స్‌తో పాటు ఫామ్‌ హౌస్‌ లోపల ఖరీదైన మద్యం బాటిళ్లు, హుక్కా పైప్స్ సైతం దొరికాయి.
పాజిటివ్‌ వచ్చిన వాళ్లలో కొందరు వారం కిందట సిమ్లా నుంచి వచ్చామని చెబుతున్నారు. మరికొందరి గోవా నుంచి వచ్చామని చెబుతున్నారు.  ఫామ్‌హౌస్​లో రాత్రి 9:30 నుంచి ఉదయం 2 గంటల వరకు తనిఖీలు చేసి మద్యం బాటిళ్లతో పాటు 2గ్రాముల వైట్‌ పౌడర్‌ను సీజ్‌ చేశారు. అందరి బ్లెడ్‌ శాంపిల్స్‌ను ఫోరెనిక్స్ ల్యాబ్‌కి పంపించినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ వెల్లడించారు.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్​హౌస్​ను పూర్తిగా సీజ్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్నటి ఘటనపై సీపీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఫామ్ హౌస్​ను సీజ్ చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.