మార్చి 4న శ్రీలంక సమీపంలో అమెరికా సబ్‌మెరైన్ దాడిలో మునిగిపోయిన ఇరాన్ యుద్ధనౌకలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందిలో గుర్తించిన 80 మంది ఇరానీల మృతదేహాలను, కొచ్చిలో చిక్కుకు పోయిన ఇరాన్ నావికులు 100 మందిని, మరోకొంతమని ఇరాన్ పౌరులను ఇరాన్ పంపిన ప్రత్యేక విమానంలో శుక్రవారం రాత్రి తరలించారని తెలిసింది.
కొలంబో నుంచి ఆ మృతదేహాలను తీసుకొచ్చిన విమానం శుక్రవారం రాత్రి కొచ్చిలో దిగింది. శనివారం ఐఆర్ఐఎస్ లావన్‌లోని అత్యవసరం కాని సిబ్బందిని తీసుకుని బయలుదేరింది. ప్రస్తుతం ఐఆర్ఐఎస్ లావన్‌లో 50 మందికిగా అత్యవసర సిబ్బంది మాత్రమే ఉన్నట్లు తెలిపింది. వారు కూడా త్వరలోనే ఆర్మేనియా మీదుగా ఇరాన్‌కు వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
నౌకలో ఆర్మేనియాకు రాజధాని యెరెవాన్‌కు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇరాన్‌కు చేరుకుంటారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ యుద్ధనౌకలోని అత్యవసరం కాని సిబ్బందిని భారత్ వెనక్కి పంపింది. ఈ నెల 1న ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక ఐఆర్ఐఎస్ లావన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఇరాన్ విజ్ఞప్తి మేరకు నౌకను కొచ్చిలో లంగరు వేసేందుకు భారత్‌ను అనుమతించింది.
ఈ క్రమంలో ఈ నెల 4 నుంచి ఐఆర్ఐఎస్ లావన్ 183 మంది సిబ్బందితో సహా కొచ్చిలోనే ఉండిపోయింది. ఇరాన్‌కు చెందిన ఐఆర్ఐఎస్ లావన్ నౌకలోని సుమారు 183 మంది సెయిలర్లు కొచ్చిలో ఉన్న విషయం తెలిసిందే. భారత్‌కు వచ్చిన ఇరాన్ నౌక్ పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇక్కడే నిలిచిపోయింది.
అయితే ఆ నౌకకు చెందిన సుమారు వంద మందికిపైగా సిబ్బంది కొచ్చి నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం రాత్రి వెళ్లిపోయినట్లు తెలిసింది. వీరితో పాటు వేర్వేరు కారణాల వల్ల భారత్‌లో చిక్కుకున్న సుమారు 30 మంది ఇరానీ పౌరులు కూడా ఆ ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. ఇరానీ నావికుల తరలింపు ప్రక్రియ చాలా రహస్యంగా సాగింది. పశ్చిమాసియా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని .. తరలింపు గురించి మీడియాకు కానీ, ప్రజలకు కానీ సమాచారం ఇవ్వలేదు.

More Stories
హిందూ పోలీస్ ను చంపిన బంగ్లా విద్యార్థి నేత ఢిల్లీలో పట్టివేత
ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకు సీబీఐ
హాంకాంగ్‌లో ఏడు భవనాలకు మంటలు.. 55 మంది మృతి