రుతుస్రావ సెలవుల చట్టం మహిళ ఉపాధికే అడ్డంకి

రుతుస్రావ సెలవుల చట్టం మహిళ ఉపాధికే అడ్డంకి

మహిళల కోసం రుతుస్రావ సెలవులను తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావడం వారి ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.   అలాంటి చ‌ట్టాలు త‌యారు చేయ‌డం వ‌ల్ల ప‌నిచేస్తున్న మ‌హిళ‌ల్లో మాన‌సిక‌మైన భ‌యాందోళ‌న‌లు క‌లిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కోర్టు తెలిపింది. పురుషుల క‌న్నా తాము త‌క్కువ అన్న భావ‌న వారిలో క‌లుగుతుంద‌ని సీజే తెలిపారు.

మహిళలకు తప్పనిసరి రుతుక్రమ సెలవులు మంజూరు చేసేందుకు అవసరమైన నిబంధనలను రూపొందించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది.  ”రుతుస్రావ సెలవులపై చట్టం చేస్తే, యజమానుల మనస్తత్వం మీకు తెలియదు. వారు మహిళలను ఉద్యోగంలోకి తీసుకోరు. ఇది మహిళల్లో కూడా తాము పురుషుల కన్నా ‘తక్కువ’ అనే మానసిక భయాన్ని, భావనను సృష్టిస్తుంది” అని జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వాదనల సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎం.ఆర్. షంషాద్ మాట్లాడుతూ 2013లో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినులకు రుతుస్రావ సెలవులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు అయితే, సీజేఐ సూర్యకాంత్ స్పందిస్తూ అవి స్వచ్ఛందంగా తీసుకున్న చర్యలని, చట్టం రూపంలో తప్పనిసరి చే ద్ధంగా తప్పనిసరి చేస్తే, ఎవరూ వారికి ఉద్యోగాలు ఇవ్వరు. ప్రభుత్వ లేదా న్యాయవ్యవస్థలోనూ వారిని తీసుకోరు. వారి కెరీర్ ముగిసిపోతుంది. ఇంట్లోనే కూర్చోవాలని చెబుతారు” అని ఆయన వ్యాఖ్యానించారు.

అవగాహన కల్పించడం, పరిశుభ్రత గురించి తెలియజేయడం వేరు కానీ సెలవులను తప్పనిసరి చేస్తూ చట్టం చేస్తే వారిని మహిళలను ఎవరూ నియమించకోరు అని పిటిషనర్‌ను హెచ్చరించారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడతారని, రుతుక్రమాన్ని చెడుగా పేర్కొంటారని తెలిపారు.