ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతుండడంతో, హర్మూజ్ జలసంధి అగ్నిగుండంలా మారుతోంది. ముడిచమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వచ్చే చమురు నౌకలపై ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతోంది. తాజాగా హర్మూజ్ నుంచి భారత్ వైపు వస్తున్న థాయ్ కార్గో నౌకపై దాడి జరిగింది. దీంతో నౌకలోని ముగ్గురు గల్లంతు అయ్యారని రాయల్ థాయ్ నేవీ ప్రకటించింది.
దీనితో ఆ నౌక పూర్తిగా దగ్ధమైందని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ఒమన్ కు ఉత్తరాన ఉన్న జలసంధిలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. అంతకు ముందు యూఏఈ రాస్ అల్-ఖైమా సమీపంలో ఒక నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. ఈ డ్రోన్ దాడిలో ఆ కంటైనర్ నౌక ధ్వంసమైనట్లు తెలిపింది. పైగా ఈ జలసంధిలో ఇరాన్ మందుపాతరలు అమరుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అది యూఏఈలోని ఖలీఫా పోర్టు నుంచి గుజరాత్లోని కాండ్లా పోర్టుకు బయలుదేరింది. ఒమన్ నౌకాదళం ఆ కార్గో షిప్లోని 20 మంది నావికులను రక్షించింది. కానీ ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాయల్ థాయ్ నేవీ పేర్కొంది. అంతేకాదు ఆ నౌక నుంచి దట్టమైన పొగ వెలువడుతున్న దృశ్యాలను విడుదల చేసింది. కాగా ఈ దాడి చేసినట్లు ఇప్పటి వరకు ఏ గ్రూప్ ప్రకటించలేదు. అయితే ఇది ఇరాన్ చేసిన దాడి అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వారిని రక్షించేందుకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నౌకలోని మంటలను సహాయక సిబ్బంది ఆర్పేసి, అదుపులోకి తెచ్చారు. ఈ విషయంపై ద రాయల్ థాయ్ నేవీ, యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ కూడా ప్రకటన చేశాయి. ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఈ దాడి తామే చేశామంటూ కూడా ఏ సంస్థ లేదా దేశం ఇంకా ప్రకటించలేదు. దీనిపై విచారణ జరుగుతోంది.
గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు వెళుతుండగా థాయ్ నౌక మయూరీ నరీపై జరిగిన దాడిని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణలో వాణిజ్య నౌకలను సైనిక దాడుల లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్ అమర్చుతోందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్ ఎక్కడైనా మైన్స్ అమర్చినట్లైతే, వాటిని తక్షణమే తొలగించాలని హెచ్చరించారు. లేదంటే మునుపెన్నడూ చూడని స్థాయిలో విధ్వంసం చూస్తారని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. అయితే అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
కాగా, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సమయంలో కీలకమైన గల్ఫ్ జలమార్గం మూసివేయడం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నందున, హార్ముజ్ జలసంధి ద్వారా “ఒక లీటరు చమురు”ను అనుమతించబోమని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జిసి) స్పష్టం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ లేదా వారి మిత్రదేశాలకు సంబంధించిన ఏదైనా నౌకను “చట్టబద్ధమైన లక్ష్యంగా పరిగణిస్తారు” అని హెచ్చరించింది.అంతేకాదు అమెరికా, ఇజ్రాయెల్ లతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దాడులు ఇలానే కొనసాగితే, ఈ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులు జరగకుండా పూర్తిగా అడ్డుకుంటామని హెచ్చరించింది. ట్రంప్ కన్నా బలవంతులైన వారు కూడా ఇరాన్ ను ఏం చేయలేకపోయారని పేర్కొంది. ఇరాన్ భద్రతా మండలి అధికారి అలీ లారిజానీ అయితే, ‘తాను అంతం కాకుండా ట్రంప్ జాగ్రత్త పడాలని’ ఘాటుగా హెచ్చరించారు.

More Stories
ఇరాన్ డ్రోన్లపై ఉక్రెయిన్ ను ఖాతరుచేయక ఇబ్బందుల్లో అమెరికా
స్పీకర్ ఓం బిర్లాపై వీగిన అవిశ్వాస తీర్మానం
పానిపట్ లోఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభలు రేపటినుండే!