వాషింగ్టన్ ఇప్పుడ ఇరాన్ వంటి ప్రాంతీయ సవాళ్లలో బిజీగా ఉండగా, బీజింగ్ దీర్ఘకాలిక, వ్యూహాత్మక సమతుల్యతను సృష్టించే అవకాశాన్ని ఉపయోగిస్తోంది. ఈ ప్రణాళిక ఒక సాధారణ ఆర్థిక పత్రంలా కాకుండా, రాబోయే దశాబ్దాల్లో చైనా సైనిక, ఆర్థిక బలాన్ని నిర్ణయించే అత్యాధునిక సాంకేతికతలపై ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసే సమగ్ర వ్యూహంగా కనిపిస్తోంది.
ఏఐ, హ్యూమనాయిడ్ రోబోటిక్స్, క్వాంటం కమ్యూనికేషన్, మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ల వంటి సాంకేతికతలను కేంద్రబిందువుగా ఉంచిన ఈ ప్రణాళిక చైనాకు ఆర్థిక, సైనిక పరిధిలో కీలక ప్రయోజనాలను ఇస్తుంది. అలాగే చైనా ఏఐ-సంబంధిత పరిశ్రమలు తదుపరి ఐదు సంవత్సరాల్లో దాదాపు 1.4 ట్రిలియన్ డాలర్ల విలువకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
రోబోటిక్స్ పారిశ్రామిక ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష మౌలిక సదుపాయాలు, అధునాతన ఎలక్ట్రానిక్ సామగ్రి ఉత్పత్తులలో దృష్టి సారిస్తుంది. ప్రతి అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానంలో దాదాపు 435 కిలోల రేర్ ఎర్త్మూలకాలు ఉంటాయి, ఇవి ఇంజిన్లు, రాడార్, సెన్సార్లు, ఆయుధ వ్యవస్థలలో కీలకమైనవి. ఈ ఖనిజాలను శుద్ధి చేయడంలో 90 శాతానికి పైగా ఆధిపత్యం చైనాకు ఉంది.
చైనా ఈ సరఫరాను నిలిపివేస్తే అమెరికా ఎఫ్-35లను తయారు చేయలేకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చైనా గతంలో కేవలం ఖనిజాల ఎగుమతిపై నియంత్రణ కలిగి ఉండగా, ఇప్పుడు ప్రాసెసింగ్ సాంకేతికతను కూడా కాపాడుతుంది. విదేశీ కంపెనీలు చైనా నుండి ప్రత్యేక లైసెన్సులు లేకుండా ఖనిజాలను పొందలేరు.

More Stories
ఇరాన్‌పై యుద్ధంలో ప్రయోజనం పొందుతున్న ఏకైక దేశం రష్యా
ఇరాన్ సంక్షోభంలోనూ బంగ్లాదేశ్‌కు 5,000 టన్నుల డీజిల్
ఇరాన్ యుద్ధంపై పుతిన్‌తో గంటసేపు ఫోన్ లో మాట్లాడిన ట్రంప్