ముస్లిం మహిళలకు వివక్షత కలిగిస్తున్న ముస్లింలకు సంబంధించిన 1937 నాటి షరియా చట్టంలోని నిబంధనలను కొట్టివేయాలంటూ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను “చాలా మంచి కేసు”గా అభివర్ణిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, దీనిని శాసనసభ మాత్రమే పరిశీలించాలని తెలిపింది.
ముస్లిం మహిళలకు వివక్షత కలిగిస్తున్న ముస్లింలకు సంబంధించిన 1937 నాటి షరియా చట్టంలోని నిబంధనలను కొట్టివేయాలంటూ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను “చాలా మంచి కేసు”గా అభివర్ణిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, దీనిని శాసనసభ మాత్రమే పరిశీలించాలని తెలిపింది.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం ఈ సమస్యకు ఉమ్మడి పౌర స్మృతి పరిష్కారం అని పేర్కొన్నది. షరియాలోని వారసత్వ నిబంధనను కొట్టివేస్తే చట్టపరమైన శూన్యత ఏర్పడుతుందని, ఎందుకంటే ముస్లింల వారసత్వాన్ని నియంత్రించే మరో చట్టబద్ధమైన మార్గం ఏదీ లేదని తెలిపింది.
పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను ఉద్దేశించి సీజేఐ మాట్లాడుతూ.. ‘సంస్కరణలు తేవాలన్న మన అత్యుత్సాహం వల్ల, షరియాలోని వారసత్వ నిబంధన ద్వారా ప్రస్తుతం వారు పొందుతున్న దానికంటే తక్కువ మొత్తాన్ని ఇచ్చిన వారమవుతామేమో. ఒకవేళ 1937 నాటి షరియా చట్టాన్ని రద్దు చేస్తే.. ఆ తరువాత పరిస్థితి ఏంటి? అనవసరమైన శూన్యత ఏర్పడదా?’ అని ప్రశ్నించారు.
‘ఈ కేసులో ముస్లిం మహిళలు వివక్షకు గురవుతున్నారన్న మీ వాదన సబబే. కానీ ఈ అంశాన్ని ప్రభుత్వ విధాన నిర్దేశక సూత్రాల ప్రకారం ఏకరీతి పౌర నియమావళిని అమలు చేయాలనే ఆదేశం ఉన్న శాసనసభ విజ్ఞతకు కోర్టు దానిని వాయిదా వేయడం సముచితం కాదా?” అని ప్రశ్నించారు. ఈ సమస్యకు పరిష్కారం ‘ఉమ్మడి పౌర స్మృతే’ అని సీజేఐ స్పష్టం చేశారు.
జస్టిస్ బాగ్చీ జోక్యం చేసుకుంటూ.. ఒక వ్యక్తికి ఒక భార్య అన్న నిబంధన అన్ని మతాలకు ఒకేరీతిగా వర్తించడం లేదని చెప్పారు. “కానీ కోర్టు అన్ని రెండవ వివాహాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించగలదా? కాబట్టి, ఆదేశిక సూత్రాలను అమలులోకి తీసుకురావడానికి మనం శాసన అధికారానికి దూరంగా ఉండాలి,” అని ఆయన పేర్కొన్నారు,
ఈ సమస్యను శాసన విజ్ఞానానికి వాయిదా వేయడం ఉత్తమమని సూచించారు. “ఈ కోర్టు పదే పదే ఏకరీతి పౌర నియమావళిని అమలు చేయాలని శాసనసభకు సిఫార్సు చేసింది” అని జస్టిస్ బాగ్చి గుర్తు చేశారు. ముస్లిం మహిళలు పురుషులతో సమానంగా వారసత్వ హక్కులకు అర్హులని కోర్టు ప్రకటించవచ్చని, 1937 నాటి ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్‌ను కోర్టు కొట్టివేస్తే భారత వారసత్వ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయని భూషణ్ ప్రారంభంలోనే వాదించారు.

More Stories
ఓంబిర్లాపై అవిశ్వాసం.. అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం!
నకిలీ సమాచారం, భావ వ్యక్తీకరణపై సమతుల్యత అవసరం
ఇరాన్‌పై యుద్ధంలో ప్రయోజనం పొందుతున్న ఏకైక దేశం రష్యా