తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.30 నిమిషాలకు లోక్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎకే సింగ్ కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణం చేయడం విశేషం. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా రుద్రాపుర్ గ్రామంలో 1952 ఏప్రిల్ 1న శుక్లా జన్మించారు. అదే గ్రామంలో పాఠశాల విద్యా పూర్తి చేసి, గోరఖ్‌పూర్‌లో కాలేజీ విద్యా పూర్తి చేశారు. ఆ తర్వాత న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. ఇంతకముందు శివపత్రాప్ మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయమంత్రిగా పని చేశారు. ఈయన విద్యార్థిగా ఉన్నప్పుడే ఏబీవీపీ సంస్థాగత కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత 1983లో బీజేపీలో చేరారు.
1989లో మొదటిసారి గోరఖ్‌పూర్ నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతాపార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ తర్వాత మళ్లీ 1991లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. యూపీలో మొదటిసారి కల్యాణ్‌సింగ్ నేతృత్వంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలో పని చేశారు. నాలుగు సార్లు 1993, 1996లలో ఎమ్మెల్యేగా ఎన్నికై విధులు నిర్వహించారు. 1996లో కల్యాణ్‌సింగ్, రామ్‌ప్రకాశ్ గుప్తా, రాజనాథ్ల ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు.

More Stories
దానం, కడియంలకు స్పీకర్ క్లీన్చిట్.. మండిపడ్డ ప్రతిపక్షాలు
అర్బన్ నక్సల్స్ తో తెలంగాణ విద్యావిధానమా?
రామగుండంలో రానున్న ఎన్టీపీసీ ప్లాంట్ విద్యుత్ కొనాలి!