ఒంటిమిట్ట ఆలయం పరిసరాలు, టిటిడి భవనం, వాహన మండపం, ప్రధాన కూడళ్లు, అలాగే ఒంటిమిట్ట నుండి మాధవవరం వరకు ఏర్పాటు చేస్తున్న అద్భుత విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్ర ముగ్ధులను చేయనున్నాయి. పండుగ వాతావరణాన్ని మరింత మధురంగా మార్చుతూ బ్రహ్మోత్సవాల వైభవాన్ని కొత్త ఎత్తులకు చేర్చేలా ఈ ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఆలయం లోపల, వెలుపల ప్రాంతాలు, నాలుగు మాడ వీధులు, పుష్కరిణి, కార్ పార్కింగ్ ప్రాంతం, ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలు, కల్యాణ వేదిక తదితర ప్రాంతాలు రాత్రివేళల్లో రజత కాంతులతో మెరిసిపోతూ బ్రహ్మోత్సవాలకు అపూర్వమైన శోభను చేకూర్చనున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా చిన్న, మధ్య, పెద్ద పరిమాణాల్లో సుమారు 60కు పైగా అద్భుత ఇల్యూమినేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో శ్రీరామ పట్టాభిషేకం, శ్రీరామ కల్యాణం, అయోధ్య రాముడు, ఏనుగు మీద శ్రీవారు, గరుత్మంతుడిపై శ్రీవారు, శ్రీ పద్మనాభ స్వామి, అమ్మవారి త్రీడీ రూపం, దశావతారాలు, అష్టలక్ష్ములు వంటి దివ్యరూపాలు విద్యుత్ కాంతుల్లో ప్రతిఫలిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక శోభను పంచనున్నాయి.

More Stories
నీటి నిల్వకు ముందే పోలవరం నిర్వాసితులను తరలించాలి
అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా రాజధాని అమరావతి
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు స్వదేశీ కిట్ లను బహూకరించిన మాధవ్