టీ20 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మొత్తం రూ.131 కోట్ల నజరానా ఇవ్వనున్నట్టు మంగళవారం వెల్లడించింది. రూ.131 కోట్ల మొత్తం నగదును ప్రధానంగా 15 మంది ఆటగాళ్లకు ఇవ్వనున్నారు. అదనంగా ప్రధాన కోచ్, సహాయక కోచ్‌లు, ఫిజియో, ట్రైనర్లు, ఇతర సపోర్ట్ స్టాఫ్‌కు కూడా వారి హోదా ఆధారంగా వాటాలను కేటాయించనున్నారు.
2007లో జరిగిన తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలిచినప్పుడు బీసీసీఐ మొత్తం రూ.12 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 2007లో జరిగిన తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలిచినప్పుడు బీసీసీఐ మొత్తం రూ.12 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది.
కాగా, ఇప్పటికే ప్రపంచ విజేతగా నిలిచిన టీమిండియాకు ఐసీసీ 3 మిలియన్ అమెరికన్ డాలర్లను బహుమతిగా ఇచ్చింది. మన భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.27.48 కోట్లు. గత వరల్డ్ కప్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ దాదాపు రూ.4 కోట్లు పెరగడం విశేషం. ఇక రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు దాదాపు రూ.14.65 కోట్లు దక్కాయి. ఫైనల్లో ఓడినప్పటికీ, టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడినందుకు కివీస్‌కు ఈ భారీ మొత్తం లభించింది.
ప్రపంచ కప్ లో ఆడిన జట్లకు ఐసిసి నగదు కానుకలను ప్రకటించింది. సెమీ ఫైనల్ వరకు వచ్చి తృటిలో ఫైనల్ చేరలేక పోయిన ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లకు ఐసిసి తలా రూ.7.24 కోట్లు అందజేసింది. ఇక సూపర్ 8 దశకు చేరుకుని వెనుదిరిగిన జట్లు కూడా నగదు బహుమతులు అందుకున్నాయి. పాకిస్థాన్, జింబాబ్వే, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు ఒక్కో జట్టుకు రూ.3.48 కోట్లు చొప్పున ప్రైజ్ మనీ దక్కింది.
గ్రూప్ స్టేజ్ దాట లేకపోయిన ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యూఏఈ, యూఎస్ఏ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నేపాల్, ఐర్లాండ్, ఇటలీ, ఒమన్, నమీబియా.. మొత్తం 12 జట్లకు ఐసిసి ఒక్కో జట్టుకు రూ.2.29 కోట్లు పంపిణీ చేసింది.

More Stories
ఇరాన్ భారీ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’
పశ్చిమాసియాలో తీవ్రమైన మానవత్వ అత్యవసర పరిస్థితి
తెలుగు రాష్ట్రాలతో సహా 22 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన