“ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో కొన్ని టీవీ ఛానళ్లు ‘అనవసరమైన సంచలనాత్మకత, ఊహాజనిత అంశాలను ప్రసాసం చేస్తున్నాయి. ఇటువంటి కథనాలు సాధారణ ప్రజల్లో, ముఖ్యంగా ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న వారు లేదా ఆ ప్రాంతాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిగిన వారిలో భయాందోళనలు కలిగించే అవకాశం ఉంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్తా ఛానళ్లకు సంబంధించిన టీఆర్పీ ఇవ్వడం నాలుగు వారాల పాటు కానీ, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కానీ తక్షణమే నిలిపివేయాలి” అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సాధారణంగా టీవీ ఛానళ్లకు వచ్చే ప్రకటనల ఆదాయం పూర్తిగా ఈ టీఆర్పీ రేటింగ్లపైనే ఆధారపడి ఉంటుంది. ఏ ఛానల్‌కు ఎక్కువ రేటింగ్ వస్తే, ఆ ఛానల్‌కు భారీగా యాడ్స్ వస్తాయి. తద్వారా ఆదాయం వస్తుంది. రేటింగ్‌ల కోసం పోటీ పడే క్రమంలో వార్తా ఛానళ్లు ఒకదానికొకటి పోటీ పడి మరీ ‘బ్రేకింగ్ న్యూస్’ పేరుతో సంచలనాలకు తెరలేపుతున్న వైనాన్ని నిత్యం చూస్తూనే ఉన్నాం.
తమ సుప్రీం లీడర్ మరణానికి ప్రతీకారంగా అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ ఆస్తులపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ అంతర్జాతీయ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. ఇలాంటి సున్నితమైన సమయంలో, శాస్త్రీయ ఆధారాలు లేకుండా వార్తా సంస్థలు యుద్ధం ముగిసిపోతుందని, అణు యుద్ధం వస్తుందని చేసే ప్రసారాలు ప్రజా శాంతికి విఘాతం కలిగిస్తాయని కేంద్రం భావించింది.

More Stories
రూ. 2.38 లక్షల కోట్లతో యుద్ధ విమానాల కొనుగోలు
ఎరువుల కొరత లేదు.. ఆందోళన వద్దు
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం