2000 కిలోమీట‌ర్ల రేంజ్‌ ఖొర్ర‌మ్‌షార్ క్షిప‌ణి ప్ర‌యోగించిన ఇరాన్‌

2000 కిలోమీట‌ర్ల రేంజ్‌ ఖొర్ర‌మ్‌షార్ క్షిప‌ణి ప్ర‌యోగించిన ఇరాన్‌
ఇరాన్ భీక‌ర రీతిలో ప్ర‌తిదాడి చేస్తుండగా తాజాగా 2000 కిలోమీట‌ర్ల రేంజ్ ఉన్న ఖొర్ర‌మ్‌షార్-4 క్షిప‌ణిని ప్ర‌యోగించింది. సుమారు ఒక ట‌న్ను వార్‌హెడ్స్‌తో ఉన్న ఆ క్షిప‌ణిని గురువారం ఇజ్రాయెల్‌లోని బెన్ గురియ‌న్ విమానాశ్రయం మీద‌కు ఇరాన్ వ‌దిలింది. ఉద‌యం ఆ క్షిప‌ణిని ప్ర‌యోగించిన‌ట్లు ఇస్లామిక్ రెవ‌ల్యూష‌రీ గార్డ్ కార్ప్స్ పేర్కొన్న‌ది. 
 
టెల్ అవివ్‌లోని బెన్ గురియ‌న్ విమానాశ్ర‌యంలో ఉన్న వైమానికి ద‌ళానికి చెందిన 27వ స్క్వాడ్ర‌న్ బేస్‌పై కూడా దాడి చేసిన‌ట్లు ఇరాన్ వెల్ల‌డించింది. అయితే ఇరాన్ చేసిన ప్రకటనను ఇజ్రాయెల్ ఖండించింది. ఇజ్రాయిలీ ఎయిర్ ఫోర్స్‌లో 27వ స్క్వాడ్ర‌న్ లేద‌ని వెల్ల‌డించింది. బ‌హుశా ఎయిర్‌బేస్ 27 అయి ఉంటుంద‌ని, ఆ ఎయిర్‌బేస్‌ను 2010లోనే మూసివేసిన‌ట్లు ఇజ్రాయెల్ చెప్పింది. 
 
ఇరాన్ ప్ర‌యోగించిన అన్ని బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను త‌మ ఎయిర్ డిఫెన్స్ వ్య‌వ‌స్థ‌లు అడ్డుకున్నాయ‌ని ఇజ్రాయెల్ ప్ర‌క‌టించింది. అయితే ఓ క్షిప‌ణి మాత్రం సెంట్ర‌ల్ టౌన్‌లోని ఖాళీ స్థ‌లంలో ప‌డిన‌ట్లు ఐడీఎఫ్ వెల్ల‌డించింది. గ‌ల్ఫ్ దేశాల్లో ఉన్న సుమారు 20 అమెరికా బేస్‌ల‌ను ధ్వంసం చేసిన‌ట్లు ఇరాన్ చెప్పింది. కువైట్‌, బ‌హ్రెయిన్‌, యూఏఈ దేశాల్లో ఆ బేస్‌లు ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. ఖ‌మేనీ మృతికి ప్ర‌తీకారంగా ప‌శ్చిమాసియాలోని వివిధ దేశాల‌పై ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తున్న విష‌యం తెలిసిందే.