* జాతీయ స్థాయిలో తెలుగమ్మాయి సృజనకు 55వ ర్యాంక్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 తుది ఫలితాల్లో మెడికో అనూజ్ అగ్నిహోత్రి తొలి ర్యాంకులో నిలవగా. ఆ తర్వాత రాజేశ్వరి సువే, ఆకాన్ష్ ధుల్, రాఘవ్ ఝంఝన్‌వాలా, ఇషాన్ భట్నాగర్, జిన్నాయ్ అరోరా, ఏఆర్ రజా మొయినుద్దీన్, పక్షల్ సెక్రెటరీ, అస్థా జైన్, ఉజ్వల్ ప్రియాంక్‌లు వరుసగా మొదటి 10 స్థానాల్లో నిలిచారు.
న అనే తెలుగమ్మాయి 55వ ర్యాంకు సాధించారు. డీఎస్కేపలువురు తెలుగువారు కూడా సివిల్స్‌లో మెరిశారు. టాప్ 100లోపు మాత్రం ఒకరే ఉన్నారు. గూడెల్ల సృజన అనే తెలుగమ్మాయి 55వ ర్యాంకు సాధించారు. డీఎస్కే ప్రచేత్ 193 ర్యాంకు, వర్షిత్ రెడ్డి 259, ఎం పవన్ కుమార్ రెడ్డి 297, పల్లి ప్రమోద్ విష్ణవి 640, వెలిమినేటి విజయ సింహారెడ్డి 682, శ్రవణ్ కుమార్ 768, కోరుపోతుల శ్రీధర్ రాజు 806, కట్టా ప్రత్యూష్ 908, గోగుల రాజశేఖర్ 920, గుగులోతు జితేందర్ నాయక్ 933 ర్యాంకు సాధించారు.
ఆలిండియా టాపర్ అనూజ్ అగ్నిహోత్రి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా రహతా గ్రామానికి చెందిన యువకుడు. జోధ్‌పూర్ ఎయిమ్స్ నుంచి 2023లో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. తొలి ప్రయత్నంలోనే 2024 సివిల్స్‌కు ఎంపికైనా.. ఢిల్లీ, కేంద్ర పాలిత ప్రాంత అడ్మినిస్ట్రేషన్‌లో గ్రూప్ బి ఆఫీసర్‌గా చేరారు. కానీ, రెండో ప్రయత్నంలో మాత్రం మొదటి ర్యాంకుతో తన కలల కొలువు సాధించారు.
మొత్తం 958 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా, వీరిలో జనరల్ 317, ఈడబ్ల్యూఎస్ 104, ఓబీసీ 306, ఎస్టీ 158, ఎస్టీ 73 మంది ఉన్నారు. మొత్తం 1087 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసినా 130కిపైగా పోస్టులకు అర్హులైనవారు లేకపోవడంతో పక్కనబెట్టింది. ఐఏఎస్ 180, ఐఎఫ్ఎస్ 55, ఐపీఎస్ 150, గ్రూప్-ఏ (సెంట్రల్ సర్వీసెస్) 507, గ్రూప్-బి సర్వీసెస్ 195 ఖాళీలు ఉన్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

More Stories
కర్ణాటకలో పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్
బెంగాల్ గవర్నర్ .. తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా