మావోయిస్టు అగ్రనేత, సిపిఐ (మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి ఆపరేషన్ కాగర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ప్రస్తుతం నేపాల్ లో ఆశ్రయం పొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారని, ఢిల్లీలో హోంమంత్రి సమక్షంలో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని పోరుగా ప్రచారం జరుగుతుంది.
గణపతి లొంగుబాటుతో మావోయిస్టులో అగ్ర నేతల శకం ముగిసినట్లు కాగలదని భావిస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా, అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి బుధవారం రాత్రి సమావేశమయ్యారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్, ఎస్ఐబి ఐజీ సుమతి హాజరయ్యారు. మావోయిస్టుల లొంగుబాట్లపై ముఖ్యమంత్రి నివేదిక ఇచ్చారు. ఆపరేషన్ కగార్ కు తెలంగాణ పోలీసులు సహకరించారని పేర్కొంటూ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఇలాగే సహకరించాలని, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని అమిత్ వారికి చెప్పారు.
మార్చి 31, 2026 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం (ఆపరేషన్ కగార్) నేపథ్యంలో, అత్యున్నత స్థాయి నేత అయిన గణపతి జనజీవన స్రవంతిలోకి రావడం ఒక చారిత్రక పరిణామంగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. జగిత్యాల జిల్లా సారంగపూర్ నివాసి అయిన ముప్పాళ్ల లక్ష్మణరావు, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనప్పటికీ విప్లవ భావజాలం వైపు ఆకర్షితులై అడవిబాట పట్టారు.
2004లో పీపుల్స్ వార్ గ్రూప్ (పిడబ్ల్యూజీ), ఎంసీసీఐ విలీనమై ‘మావోయిస్టు పార్టీ’గా ఆవిర్భవించినప్పుడు ఆయన తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉంటూ విప్లవ వ్యూహాలను రచించిన గణపతి, 2018లో అనారోగ్య కారణాలతో కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. గత కొంతకాలంగా ఆయన నేపాల్ వంటి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ జీవితం గడపాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఆయన అందుబాటులోకి వచ్చారని, పరస్పరం సమాలోచనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. గణపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా, వారి సాయుధ పోరాట ముగింపునకు దారితీసే పరిణామంగా భావిస్తున్నారు.
మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో కీలక పాత్ర వహించారు. 1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్ లో జన్మించిన ఆయనను ఉద్యమంలో గణపతిని టీచర్ అని పిలిచేవారు. నక్సలైట్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి నేతగా గణపతికి గుర్తింపు వచ్చింది. ఆయన భార్య సుజాత ఇప్పటికీ ఉద్యమంలో కొనసాగుతున్నారు.

More Stories
నేపాల్ ఎన్నికల్లో హిందూ రాచరికం పునరుద్ధరణకు డిమాండ్
రాజ్యసభ అభ్యర్థిగా నీతీశ్ కుమార్ నామినేషన్
మార్చి 6 నుంచి 8 వరకు ఇంద్రకీలాద్రిపై ‘మహా కుంభాభిషేకం’