ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా అయతొల్లా అలీరెజా అరాఫీ నియామకమయ్యారు. ఈ మేరకు ఇరాన్ నాయకత్వం ఆయన పేరును ఇరాన్ మధ్యంతర సుప్రీం లీడర్‌గా ప్రతిపాదించింది. ఆయన స్థానికంగా సీనియర్ మత గురువుగానే కాకుండా, గతంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకుంది. అయతొల్లా అరాఫీని మధ్యంతర అధినేతగా నియమించింది. ప్రస్తుతం ఇరాన్‌ను అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, చీఫ్ జస్టిస్ ఘోలాంహోస్సేన్ మోసేన్ ఆధ్వర్యంలోని కౌన్సిల్ నడిపిస్తోంది. వీరే అరాఫీని సుప్రీం లీడర్‌గా నియమించారు. అరాఫీ బాధ్యతలు, విధుల్ని ఈ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది.
అసెంబ్లీ సమావేశమై, ఖమేనీ వారసుడిని ఎన్నుకునేవరకు అరాఫీ నియామకం చెల్లుతుంది. 1959లో ఇరాన్‌లోని మేబోద్‌లో జన్మించిన అయతొల్లా అరాఫీ, షియా మతగురువుగా, ఇస్లామిక్ న్యాయనిపుణుడిగా పేరు పొందారు. 2016 నుంచి ఇరాన్ ఇస్లామిక్ సెమినరీస్ మేనేజ్‌మెంట్ సెంటర్ హెడ్‌గా, ప్రఖ్యాత కోమ్ సెమినరీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
దేశ చట్టాలను, ఎన్నికలను పర్యవేక్షించే శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్‌లో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. గతంలో 2008 నుంచి 2018 వరకు అల్-ముస్తఫా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా కూడా అరాఫీ పనిచేశారు. విద్యావంతుడు. అరబిక్, ఇంగ్లీష్ మాట్లాడగలడు. సాంకేతిక అంశాలపై కూడా ఆయనకు అవగాహన ఉంది. దీంతో ఆయన అయితేనే ప్రస్తుతం ఇరాన్‌ను నడిపించగలరని నాయకత్వం నమ్మింది. ఇకపై అరాఫీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపడుతారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు చేపట్టిన మొదటి మత గురువు కూడా ఆయనే.

More Stories
ఐదు రోజుల పాటు సైనికి దాడులకు ట్రంప్ విరామం
అమెరికా పాక్ పై బాంబులు వేస్తె భారత్ పై వేస్తాం
అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం