ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు సోమవారం సెషన్లో భారీగా పతనంమయింది. కిందటి రోజు రూ. 83.51 వద్ద ముగిసిన షేర్ ధర సోమవారం రోజు నేరుగా 10 శాతానికి పైగా నష్టంతో రూ. 75.16 వద్ద ప్రారంభమై, 20 శాతం లాయల్ సర్క్యూట్ తో రూ 66.80 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలోనే ఇందులో మెజార్టీ షేర్ హోల్డర్లుగా ఉన్న భారత ప్రభుత్వం/ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు భారీగా నష్టాలు వచ్చాయని చెప్పవచ్చు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తాజాగా ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హరియాణా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అకౌంట్లోనే ఉద్యోగులు, ఇతరులు చేసిన రూ. 590 కోట్ల కుంభకోణం గురించి బ్యాంకు ఆదివారం వెల్లడించింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. చండీగఢ్‌లోని ఒక బ్యాంక్ బ్రాంచీలు ఈ మేరకు ఉద్యోగులు అనధికారిక, మోసపూరిత లావాదేవీలు నిర్వహించినట్లు అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లలో తీవ్ర ఒత్తిడి నెలకొనగా షేర్ ధర భారీగా పతనమైంది.
ఇంట్రాడేలో లోయర్ సర్క్యూట్‌తో కనిష్ఠ స్థాయికి పడిపోగా.. ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మార్కెట్ విలువ భారీగా తగ్గగ ఆ మేరకే ఇన్వెస్టర్ల సంపద కూడా ఒక్కరోజులో రూ. 14 వేల కోట్లకుపైగా ఆవిరైంది. ఐడీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ. 51.28 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 87 కాగా, కనిష్ఠ ధర రూ. 52.46 గా ఉంది. సెషన్ చివరకు కాస్త కోలుకొని స్టాక్ 16 శాతం నష్టంతో రూ. 70.09 వద్ద ముగిసింది.
ఇక్కడే భారత ప్రభుత్వం, ఎల్ఐసీకి కూడా నష్టాలు వచ్చాయి. వీటికి కూడా కొన్ని కంపెనీల్లో వాటాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరిట షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఎల్ఐసీ దేశీయంగా అతిపెద్ద సంస్థాగత మదుపరుల్లో ఒకటిగా ఉంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో భారత ప్రభుత్వానికి 7.75 శాతం వాటాకు సమానమైన 666,570,000 షేర్లు ఉండగా, స్టాక్ 20 శాతం పతనంతో రూ. 1100 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.
ఎల్ఐసీకి 2.35 శాతం వాటాకు సమానమైన 202,369,591 షేర్లు ఉండగా దీనికి స్టాక్ ఇంట్రాడే కనిష్ఠమైన రూ. 66.80 వద్ద రూ. 338 కోట్ల నష్టం వచ్చింది. మిగతా పెట్టుబడిదారుల్లో చూస్తే టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌కు రూ. 146 కోట్లు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి వరుసగా రూ. 299 కోట్లు, రూ. 318 కోట్ల మేర నష్టం వచ్చింది.

More Stories
రెరా అమలుతీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రంప్ సుంకాల రద్దు అమలు రేపటి నుండే
భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు వాయిదా