భారతదేశ సామాజిక చరిత్రలో పరిశుభ్రతను ఒక ఆరాధనగా మార్చి పై మహోన్నత వ్యక్తి సంత్ గాడ్గే బాబా అని ఎపి బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కొనియాడారు. రాజమహేంద్రవరం లో స్వచ్చ భారత్ లో పాల్గొన్న మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా సంత్ గాడ్గే బాబా జయంతి పి పురస్కరించుకుని స్వచ్ భారత్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
సమానత్వాన్ని మానవత్వపు మూల సూత్రంగా ప్రజల్లో నాటిన మహనీయుడు సంత్ గాడ్గే మహరాజ్.
ఆయన అసలు పేరు దేబూజీ ఝింగ్‌రాజీ జానోర్కర్. 1876 ఫిబ్రవరి 23న మహారాష్ట్రలోని అమరావతి జిల్లా షేన్గావ్‌లో జన్మించిన ఆయన, తన 29వ ఏటనే సమాజ సేవ కోసం కుటుంబాన్ని వదిలి సంచార భిక్షువుగా మారారు గాడ్గే బాబా ఏ గ్రామానికి వెళ్లినా ముందుగా ఒక చీపురు పట్టి వీధులను, మురికివాడలను శుభ్రం చేసేవారు. “దేవుడిని ఆలయంలో వెతకకండి.. ముందుగా మీ గ్రామాన్ని శుభ్రం చేయండి” అని ఆయన బోధించేవారు .
గ్రామాల్లో అపరిశుభ్రతను రూపుమాపేందుకు ఆయన ప్రారంభించిన ‘చీపురు దండు’* ఉద్యమం నేటి ‘స్వచ్ఛ భారత్’ మిషన్‌కు పునాది వంటిది. ఆయన తన భిక్షాటన ద్వారా సేకరించిన ప్రతి పైసాను ప్రజా ప్రయోజనాలకే వెచ్చించి, మహారాష్ట్ర వ్యాప్తంగా సుమారు 150 పాఠశాలలు, ధర్మశాలలు, ఆస్పత్రులు మరియు గోశాలలను నిర్మించారు. కులం పేరు అడిగితే “నేను మానవుడిని” అని సమాధానం చెప్పి కులాల గీతలను చెరిపివేసేవారాయన.
పండరీపురంలో దళిత భక్తుల కోసం ‘చొక్కమేళ’ పేరుతో తొలి ధర్మశాలను నిర్మించి సామాజిక సమానత్వాన్ని చాటారు. మద్యపానం, మూఢనమ్మకాలు మరియు జంతు బలులకు వ్యతిరేకంగా ఆయన అలుపెరగని పోరాటం చేశారు. గాడ్గే బాబా సేవలను చూసి డా. బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ వంటి నాయకులు ముగ్ధులయ్యారు. అంబేద్కర్ ఆయనను తన గురువుగా భావించేవారు.
జ్యోతిరావు పూలే తర్వాత అత్యంత గొప్ప ప్రజా సేవకుడు అని మాధవ్ వివరించారు. ఆయన గౌరవార్థం ప్రభుత్వం అమరావతి విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం ‘సంత్ గాడ్గే బాబా’ పేరును నామకరణం చేసింది. 1999లో భారత ప్రభుత్వం ఆయన గుర్తుగా తపాలా స్టాంపును విడుదల చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ‘సంత్ గాడ్గే బాబా గ్రామ స్వచ్ఛతా అభియాన్’ పథకాన్ని అమలు చేస్తోంది. 1956 డిసెంబర్ 20న ఆయన భౌతికంగా దూరమైనా, ఆయన అందించిన జ్ఞానం, ఆయన పట్టిన చీపురు నేటికీ సమాజాన్ని శుభ్రపరుస్తూనే ఉన్నాయని మాధవ్ తెలిపారు.

More Stories
ఏపీలో భారత్‌నెట్‌తో ప్రతి గ్రామానికి హైస్పీడ్ ఇంటర్నెట్
కర్ణాటకలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నసీర్ రాయచోటిలో అరెస్ట్
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిటీ