బాన్సువాడలో భక్తి గీతం పెట్టుకున్న మహిళలపై దాడి

బాన్సువాడలో భక్తి గీతం పెట్టుకున్న మహిళలపై దాడి
 
* అల్లరి మూకకు పోలీసుల వత్తాసు .. దారిలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి అరెస్ట్
 
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రిలయన్స్ మార్ట్ లో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది భక్తి పాటలు పెట్టుకోవడంతో అక్కడకు సయ్యద్ ముజామిల్ అహ్మద్ అనే వ్యక్తి వచ్చి వచ్చి అసభ్య పదజాలంతో అక్కడ పనిచేసే అమ్మాయిలను దూషిస్తూ, బూతులు తిడుతూ అభ్యంతరం చెప్పడంతో వివాదం చెలరేగింది.  రెండు రోజుల క్రితం రాత్రి 9 గంటలకు `ఐటమ్ సాంగ్స్ పెడతాను వచ్చి డాన్స్ చేయు మరీ’ అంటూ తిట్టడం, ఆమెను వీడియో తీయడంతో కలకలం చెలరేగింది.
 
అక్కడున్న అమ్మాయి బాధపడుతూ ఉండడంతో అక్కడకు వచ్చిన కొందరు వినియోగదారులు,  సిబ్బంది ఏమైందమ్మా ఎందుకు బాధపడుతున్నావ్? అని అడగగా సంఘటనలను వివరించింది. అప్పుడు ఆ వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేయగా అక్కడున్న వారు నిలదీసే ప్రయత్నం చేశారు. ఆ లోపల వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఇతరత్రా అక్కడి చేరుకొని ఇలా వీడియో ఎందుకు తీసావ్ ఎందుకు చేశావు? దేవుడు పాటలు పెట్టుకుంటే నీకేం ఇబ్బంది? అని నిలదీశారు.
 
`అవును నేను చేశాను ఏం చేస్తారో చేసుకోండి’ అని ఆ వ్యక్తి దురుసుగా సమాధానం చెప్పడంతో  వారు కోపంతో అతనిపై ఎగబడ్డారు. అటు తర్వాత పోలీసులు రావడంతో వారికి అప్పగించి వీరందరూ పోలీస్ స్టేషన్ వెళ్లి అతనిపై కేసు పెట్టే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆ అమ్మాయికి సంబంధించి బంధుమిత్రులు, కొందరు హిందూ సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ చేరుకొని మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ తొందరగా చేయడం లేదు? అంటూ  పోలీస్ స్టేషన్ ఎదుట గుమ్మిగుడి నిరసన వ్యక్తం చేసారు.
 
ఇంతలో సయ్యద్ ముజామిల్ అహ్మద్ వర్గానికి చెందిన వారు ఒక్కసారిగా  నిజ నిజాలు ఆలోచించకుండా అతనిని విడిపించాలని గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. పైగా, వచ్చినవారు రెచ్చగొట్టే ధోరణిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ కోరుతున్న వారిని వెక్కిరిస్తూ,  ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఈలలు కేరింతలు కొడుతూ చేశారు. దానికి ప్రతిస్పందనగా అవతలి వారు సైతం కొంచెం  ఆగ్రహానికి గురి అయ్యారు 
 
ఇంతలో వారు ఆకస్మాత్తుగా రాళ్లురవ్వడంతో చాలా మందికి గాయాలు కూడా తగిలాయి. గాయపడిన వారిలో ఒకరిద్దరూ పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు.
పోలీసులు రాళ్లు విసిరే వారిని బుజ్జగించి పంపించి వేస్తూ, హిందువుల వైపు మాత్రం మాత్రం లాఠీచార్జి జరిపారు. ఆ వర్గానికి చెందిన ఒక వ్యక్తి పోలీసుల సమక్షంలోనే ధర్నా చేస్తున్న హిందువుల పైకి ట్రాలీ ఆటో ఎక్కించే ప్రయత్నం చేస్తూ వేగంగా వెళ్ళిపోయాడు.
 
పైగా, వారు తిరిగి రిలయన్స్ షాపింగ్ మాల్ వద్దకు వెళ్లి ఆ మాల్ పై కూడా దాడి జరిపారు. ఈ సందర్భంలో కొంతమంది హిందూ సంఘాల నాయకులను అలాగే పట్టణానికి చెందిన బిజెపి నాయకులను అరెస్టు చేసి పూటకు ఒక పోలీస్ స్టేషన్ చొప్పున తిప్పుతూ వచ్చారు. 

బాన్సువాడకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు. శాంతియుతంగా బాన్సువాడ వెళ్లి, బీజేపీ ఎమ్మెల్యేపై జరిగిన దాడిని ఖండిస్తూ సంఘీభావం తెలపాలన్న ఉద్దేశంతో బయలుదేరిన  ఆయనను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రత్యక్ష దాడి అని బిజెపి ఖండించింది.
ఈ సంఘటన గురించి తెలుసుకొని బాన్సువాడకు వస్తున్న సందర్భంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లను ఎక్కడక్కడ అరెస్ట్ చేశారు. కొంతమందిని గృహనిర్బంధం చేశారు.

ఇప్పటికే బాన్సువాడలో దాదాపు 75 మందికి పైగా బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టారని రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. “మేము శాంతియుతంగా నిరసనకు పిలుపునిస్తే, బీజేపీ కార్యకర్తలను, హిందువులను అన్యాయంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదు. కేవలం హిందువులపైనే చర్యలు తీసుకోవడం అన్యాయం” అని ధ్వజమెత్తారు.