ఇందులో వెంట్రుకలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌ల విశ్లేషణ, రక్తం, వేలిముద్రలు, బుల్లెట్లు, లేదా డీఎన్ఏ నమూనాలు, ఆయుధాలు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా ప్రతీది ఇతర అన్ని ఆధారాలను ల్యాబ్‌లోనే పరిశీలించి నివేదికలు సిద్ధం చేస్తారు. ఈ ఆధారాలు ఎన్నో కోర్టు తీర్పుల్లో కీలకంగా ఉంటాయి. కానీ ఈ ప్రమాద ప్రభావం వల్ల కేసుల దర్యాప్తుపై ఎంత వరకు పడనుందనేది ఆందోళనకరమైన విషయం.
హైదరాబాద్ నాంపల్లిలోని ఫిబ్రవరి 7న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ ఎన్నో కీలక కేసులకు సంబంధించి సున్నితమైన డేటా ధ్వంసమైంది. ఈ అగ్ని ప్రమాదంలో మొదటి అంతస్థులోని కంప్యూటర్లు, ఫిజికల్ ఎవిడెన్స్ సహా ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో అత్యంత కీలకమైనది ఎఫ్ఎస్ఎల్ సంస్థ. ఇది జరిగిన నేరాలకు సంబంధించిన ఆధారాలను శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షించి నివేదికలు సమర్పిస్తుంది. కోర్టు తీర్పుల్లో కీలకంగా ఉండేవి ఈ ఆధారాలే. వాటిలో ముఖ్యమైన ఫైళ్లు, కంప్యూటర్లు, కీలక ఆధారాలు, హార్డ్ డిస్కులు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో మంటలు రావడంతో దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో జరిగిన ఘటనపై కేసు నమోదైంది.
మొదటగా ప్రాపర్ట్ రూమ్‌లోకి భారీగా పొగతో కూడిన మంటలు వ్యాపించాయని ఆ తర్వాత ఇతర గదులకు వచ్చాయని తెలిపారు. ఈ ప్రమాదం ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం 10.08 గంటలకు జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, కేసు వెరిఫికేషన్ ఛాంబర్, ప్రాపర్టీ రూమ్, సర్వర్ రూమ్, హెచ్ఆర్డీ హాల్, అనాలసిస్ ఛాంబర్‌తో పాటు ఫర్నిచర్ పరికరాలు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని వివరించారు.

More Stories
మార్చి రెండో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
చంచల్‌గూడ జైలు నుంచి పాకిస్థాన్‌కు ఫోన్ కాల్స్!
శివుడికి దైవప్రసాదం పేరుతో మాదకద్రవ్యాలంటూ రీల్స్