“మనమందరం ఒకే దేశం, ఒకే మాతృభూమి బిడ్డలం. మనుషులుగా, మనమందరం ఒకటే. ఒకప్పుడు వివక్ష ఉండేది కాదు. కానీ కాలక్రమేణా వివక్ష అనేది ఒక అలవాటుగా మారింది దానిని నిర్మూలించాలి. సనాతన ధర్మం సామరస్యంతో సిద్ధాంతం. మనల్ని వ్యతిరేకించే వారిని నిర్మూలించాలని మనం భావించము. ప్రతిచోటా ఒకే సత్యం ఉంది. ఈ తత్వాన్ని అర్థం చేసుకొని ఆచరించడం వివక్షను తొలగిస్తుంది” అని తెలిపారు.
“మాతృశక్తి” (స్త్రీ శక్తి) అనేది గృహానికి పునాది అని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ అభివర్ణించారు. స్త్రీలను బలహీనులుగా చూడకూడదని చెబుతూ భారతీయ సంప్రదాయం మహిళలకు గౌరవనీయమైన స్థానాన్ని ఇస్తుందని, శారీరక రూపాన్ని కంటే లక్షణాలను పెంపొందించడాన్ని విలువైనదిగా భావిస్తుందని ఆయన చెప్పారు.
“మహిళ పెళ్లి తర్వాత మరొక ఇంటికి వెళ్లి అక్కడ ప్రతీ ఒక్కరిని సొంతవారిలా చేసుకుంటుంది. వారంతా యోధురాళ్లు. మహిళలు సహజంగానే శక్తిమంతులు. వారికి స్వీయ రక్షణ విద్య నేర్పించాలి. పాశ్చాత్య సంస్కృతిలో మహిళలను భార్యలుగా పరిగణిస్తారు. కానీ మనం మాత్రం మహిళలను తల్లులుగా భావిస్తాం. ఇక్కడ వారి అందం కంటే అప్యాయతకే గౌరవం ఉంటుంది” అని చెప్పారు.
దేశంలోకి చొరబడే ఆక్రమణదారులను గుర్తించి, తిరిగి పంపించాలని మోహన్ భాగవత్ చెప్పారు. ముఖ్యంగా వారికి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. వివాహం ఉద్దేశం ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లడానికని, కోరికలను తీర్చుకోవడం కోసం కాదని భగవత్ పేర్కొన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా ఆలయాలు, బావులు, శ్మశాన వాటికలకు హిందువలందరికీ అనుమతి ఉండాలని ఆయన చెప్పారు.
పిల్లలకు చిన్ననాటి నుంచే కేవలం సంపాదించడమే కాకుండా, ఇతరులకు సాయం చేయాలనే విధానాన్ని భోదించాలని సూచించారు. అన్నింటికన్నా దేశం, దేశ ప్రయోజనాలే ముఖ్యమనే భావనను కల్పించాలని తెలిపారు. ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకువచ్చిన మార్గదర్శకాలపైనా మోహన్ భాగవత్ స్పందించారు. చట్టాన్ని అందరూ తప్పకుండా పాటించాలని, ఒకవేళ తప్పుగా ఉంటే సవరించేందుక రాజ్యాంగ బద్ధంగా మార్గాలు ఉన్నాయని గుర్తు చేశారు.
“ఒకవేళ చట్టం తప్పుగా ఉంటే దానిని సవరించే మార్గం కూడా ఉంటుంది. ఘర్షణలకు కులాలు కారణం కాకూడదు. మనమంతా ఒక సమాజానికి చెందిన వారిమనే భావన ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఎవరైతే కింద పడిపోయి ఉంటే వారిని మనమే కిందకు వంగి పైకి లేపాలి. ఇలాంటి ఆలోచన ప్రతీ ఒక్కరిలోనూ ఉండాలి” అని భగవత్ హితవు చెప్పారు.
ప్రపంచమంతా సమన్వయంతోనే ముందుకుపోతుందని, వివాదాలతో కాదని స్పష్టం చేశారు. ఒకరిని తొక్కి మరొకరు పైకి ఎదగాలనే భావన ఉండకూడదని ఆయన తెలిపారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్ మార్గదర్శిగా నిలుస్తుందని మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని అనేక సమస్యలకు భారత్ వద్ద పరిష్కారాలు ఉన్నాయని చెప్పారు. మనం కలిసి మాట్లాడుకుంటే ఇద్దరి మధ్య ఉన్న బేధాభిప్రాయాలు తొలగిపోతాయని తెలిపారు.
ఇలా సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని, బలహీనులకు సాయం చేయాలని తెలిపారు. అమెరికా, చైనా లాంటి దేశాల్లోని కొందరు మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని హెచ్చరించారు. మనమందరి వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

More Stories
‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’గా స్మృతి మంధాన
“వ్యూహాత్మక భాగస్వామ్యం”గా భారత్- ఫ్రాన్స్ సంబంధాలు
ప్రపంచంలోని టాప్-3 ఏఐ సూపర్ పవర్స్ లో భారత్