25, 26 తేదీల్లో ప్రధాని మోదీ ఇజ్రాయిల్‌ పర్యటన

25, 26 తేదీల్లో ప్రధాని మోదీ ఇజ్రాయిల్‌ పర్యటన
ఈ నెల 25, 26 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయిల్‌లో పర్యటించనున్నారు. అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగిస్తారు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు సోమవారం వెల్లడించారు. అమెరికాకు చెందిన యూదు సంస్థల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు.

 

“ఇజ్రాయెల్, భారతదేశం మధ్య అద్భుతమైన మైత్రి నెలకొంది. అన్ని రకాల సహకారాన్ని చర్చించబోతున్నాము. ఇప్పుడు, మీకు తెలుసా, భారతదేశం ఒక చిన్న దేశం కాదు. దీనికి 1.4 బిలియన్ల ప్రజలు ఉన్నారు. భారతదేశం అపారమైన శక్తివంతమైనది, అపారమైన ప్రజాదరణ పొందింది” అని ఆయన నొక్కి చెప్పారు.   ఇజ్రాయిల్‌కు చెందిన ఒక సీనియర్‌ అధికారి కూడా మోదీ పర్యటన విషయాన్ని ధృవీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. 

 
అలాగే, గత కొన్ని నెలల నుంచి ఇజ్రాయిల్‌, భారత్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతేడాది నవంబర్‌లో ఇరు దేశాల మధ్య రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారం అంశాల్లో ఒక ఒప్పందం కుదిరింది. 
కాగా, మోడీకి ఇదో రెండో ఇజ్రాయిల్‌ పర్యటన కానుంది. 2017లో మోదీ  తొలిసారిగా అక్కడ పర్యటించారు.