ప్రశిక్షణ ద్వారా రాష్ట్రంలో బిజెపిని సంస్థాగత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపిచ్చారు. విజయవాడ భవానీపురంలో”పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్” రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభ సమావేశంలో కీలక దిశానిర్దేశం చేశారు.
పార్టీ సిద్ధాంతాలను, ప్రశిక్షణ ద్వారా కార్యకర్తలను క్షేత్రస్థాయిలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ ఉద్దేశం అని చెబుతూ మండల స్థాయిలో కార్యకర్తలు అందరికి ఇటువంటి శిక్షణను అందించాలని సూచించారు. ఏకాత్మ మానవత దర్శనం ద్వారా మన మూల సిద్ధాంతం ప్రశిక్షణ ద్వారా ప్రతి కార్యకర్త కు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయని దక్షిణాది రాష్ట్రాల ప్రశిక్షణ మహాభియాన్ ఇంఛార్జి కాసంవెంకటేశ్వర్లు కొనియాడారు. సంచార జాతులు, విశ్వకర్మ, నాదస్వరం వారి సమస్యలు పై బిజెపి చేసిన సేవలను కొనియాడారు. ముగింపు సమావేశంలో జాతీయ సహా సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జీ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తల శిక్షణే కీలకం అని చెప్పారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల సంఖ్య పరంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ, కార్యకర్తలలో నాణ్యత లేకపోతే పార్టీ ఆశించిన రీతిలో నడవదని హెచ్చరించారు. మంత్రి సత్య కుమార్ యాదవ్, బిజెపి శాసనసభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

More Stories
ఇక శ్రీకాళహస్తిలోను గిరి ప్రదక్షిణ!
విధాన స్థిరత్వంపై దేశ భవిష్యత్
ఏపీ మద్యం కుంభకోణం కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి