* కరీంనగర్, నిజమాబాద్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం!..పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్
తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబుబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కనిపిస్తున్నట్లు తెలిపింది.
కరీంనగర్, నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని, ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని పేర్కొన్నది. అయితే, నిజమాబాద్, కరీంనగర్, మహబుబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్ మేకర్ కావచ్చని తెలిపింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు లేవని స్పష్టం చేసింది.
రామగుండంలో కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని అంచనా వేసింది. మంచిర్యాలలో కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-9, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. కొత్తగూడెంలో కాంగ్రెస్ 28-34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14-16, ఇతరులు 2-4 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది.
మహబుబ్ నగర్ లో కాంగ్రెస్ 26-30, బీఆర్ఎస్ 18-22, బీజేపీ 6-8, ఎంఐఎం 2-4, ఇతరులు 0-1 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని అంచనా వేసింది. నల్లగొండలో కాంగ్రెస్ 21-26, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-10, ఎంఐఎం 2-4, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిజమాబాద్ లో కాంగ్రెస్ 10-16, బీఆర్ఎస్ 2-4, బీజేపీ 26-31, ఎంఐఎం 8-12, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది.
కరీంనగర్ లో కాంగ్రెస్ 14-16, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 24-29, ఎంఐఎం 6-9, ఇతరులు 1-3 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. 68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుందని అంచనా వేసింది. 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-5 బీజేపీ, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. 8-14 మున్సిపాలిటీల్లో ‘నువ్వా నేనా?’ అన్నట్టు పోటీ ఉందని పీపుల్స్ పల్స్ వివరించింది.116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 1210-1290, బీఆర్ఎస్ 860-930, బీజేపీ 250-270, ఏఐఎంఐఎం 35-44, సీపీఐ 12-17, సీపీఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.

More Stories
తెల్లాపూర్‌లో పూలే విగ్రహంపై దాడితో ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదు.
కుత్బుల్లాపూర్ లో భూప్రకంపనలు.. భయంతో ప్రజలు పరుగులు
మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..ఎన్నిక రద్దు