టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ ప్రకటించిన పాకిస్థాన్ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. టీమ్ఇండియాతో మ్యాచ్ బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ నుంచి సోమవారం అర్ధరాత్రి ప్రకటన వచ్చింది. పీసీబీతో ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ చర్చల అనంతరం ఈ ప్రకటన వచ్చింది. ఈ చర్చలతో సంతృప్తి చెందడమే కాకుండా మిత్ర దేశాలు భారత్‌తో మ్యాచ్ ఆడాలని విజ్ఞప్తి చేయడంతో పాక్ ప్రభుత్వం పీసీబీకి అనుమతి ఇచ్చింది.
“భారత్‌తో మ్యాచ్ విషయంలో చర్చలపై సంతృప్తిగా ఉన్నాం. అలాగే మిత్ర దేశాల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని టీమ్ఇండియాతో మ్యాచ్ బాయ్‌కాట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం. టీ20 ప్రపంచ కప్‌లో షెడ్యూల్ ప్రకారం భారత్‌తో మ్యాచ్ ఆడాల్సిందిగా మా (పాకిస్థాన్) క్రికెట్ బోర్డును అదేశిస్తున్నాం. దీంతో ఫిబ్రవరి 15న భారత్‌తో మ్యాచ్ కోసం మా జట్టు మైదానంలోకి దిగుతుంది” అని పాక్ ప్రభుత్వం పత్రికా ప్రకటనలో పేర్కొంది.
అంతకుముందు, ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ నిర్ణయంపై పునరాలోచించాలని ఇటీవల పీసీబీకి శ్రీలంక బోర్డు లేఖ రాసింది. అంతేకాకుండా శ్రీలంక ప్రధాని అనుర కుమార దిసనాయకే సైతం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై ప్రకటన వచ్చిన తర్వాత దిసనాయకే పాక్ ప్రధానికి ఎక్స్ వేదికగా ధన్యవాదాలు చెబుతూ పోస్టు షేర్ చేశారు. అనేక మంది ప్రమించే ఈ మ్యాచ్ జరిగేలా చూసినందుకు షరీఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
అయితే ఈ టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దాయాదుల పోరుపై సస్పెన్స్ నెలకొంది. ఐసీసీ రంగంలోకి దిగి పలు దఫాలుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో చర్చలు జరపడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న కొలంబో వేదికగా భారత్ x పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
కాగా, ఈ చర్చల్లో పాకిస్థాన్ ప్రతిపాదించిన పలు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించింది. బంగ్లాదేశ్ ఈ ప్రపంచకప్ నుంచి తప్పుకున్నందున భారత్, బంగ్లా, పాకిస్థాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ నిర్వహించాలని, అలాగే భారత్- పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు పునఃప్రారంభం చేయాలని డిమాండ్ చేసింది. అయితే ట్రై సిరీస్‌కు ఐసీసీ నో చెప్పింది. ఇక భారత్- పాక్ ద్వైపాక్షిక సిరీస్ అంశం తమ చేతుల్లో లేదని వివరించింది. అయితే, వచ్చే అండర్- 19 వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులను మాత్రం బంగ్లాదేశ్‌కు ఇచ్చే అవకాశాన్ని ఐసీసీ పరిశీలించనుందని తెలిసింది.

More Stories
ఎప్స్టీన్ ఫైల్స్‌తో బ్రిటన్ ప్రధానికి గండం… తొలి ముస్లిం ప్రధాని?
సొంత డిఎన్ఎతో కొత్త మానవజాతి సృష్టించే యత్నం
హాంగ్‌కాంగ్ మీడియా టైకూన్ జిమ్మీ లాయ్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష