మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస

మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస
మణిపుర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో మంగళవారం ఉదయం మళ్లీ హింసాకాండ చెలరేగింది. గత శనివారం రాత్రి టాంగ్‌ఖుల్ నాగ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తిపై కొందరు దాడి చేశారనే ఆరోపణలతో మొదలైన వివాదం క్రమంగా పెద్దఎత్తున హింసకు దారి తీసింది.  “సాయుధులైన వ్యక్తులు పాడుబడిన ఇళ్లకు నిప్పంటించారు. లిటాన్ సరీఖోంగ్ వద్ద అనేక రౌండ్ల బుల్లెట్లను కాల్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. భద్రతా దళాలు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
 
వందలాది మంది టాంగ్‌ఖుల్ గ్రామస్థులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇళ్లు వదిలి కాంగ్పోక్పి, ఉఖ్రుల్ జిల్లాలోని సురక్షిత ప్రాంతాలకు.. రెండ్రోజులుగా తరలిపోతున్నారు. ఈ క్రమంలో ఉఖ్రుల్ జిల్లాలో తాజాగా హింస చెలరేగింది. నాగాలు వదలివెళ్లిన ఇళ్లకు కొందరు నిప్పు పెట్టారని, కాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు.

ఉఖ్రుల్, కాంజోంగ్ జిల్లాల్లో కుకీల కదలికలపై రెండు నాగా సంస్థలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో లిటాన్ సారేఖాంగ్‌లో కాల్పులు, ఇళ్లకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు సాయుధులు.. నాగాలు విడిచివెళ్లిన ఇళ్లకు నిప్పుపెట్టి, కాల్పులు జరిపారని, పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని ఓ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అదనపు సాయుధ బలగాలను ఆ ప్రాంతంలో మోహరించినట్టు చెప్పారు.కాగా, ముందు జాగ్రత్త చర్యగా ఉఖ్రుల్ జిల్లా రెవెన్యూ పరిధిలో బ్రాడ్‌బ్యాండ్, వీపీఎన్, వీసాట్ సహా ఇంటర్నెట్ సర్వీసులను 5 రోజుల పాటు మణిపుర్ ప్రభుత్వం నిలిపివేసింది. సాయుధుల హింసాకాండలో ఇప్పటివరకూ మొత్తం 21 ఇళ్లు దగ్ధమైనట్టు మంత్రి గోవిందాస్ కొంతౌజం తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని, శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు అదనపు బలగాలను పంపామని తెలిపారు.

అధికారుల ప్రకారం, వందలాది మంది కుకి, తంగ్ఖుల్ నాగా గ్రామస్తులు, ప్రధానంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, గత 2 రోజులుగా లిటాన్ సరీఖోంగ్, సమీపంలోని కుకి గ్రామాల నుండి కాంగ్‌పోక్పి, ఉఖ్రుల్ జిల్లాల్లోని సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్నారు. “కుకి మెజారిటీ కాంగ్‌పోక్పి జిల్లాలోని మోట్‌బంగ్, సైకుల్‌లోని కొన్ని ప్రాంతాలలో అనేక మంది గ్రామస్తులు ఆశ్రయం పొందారు” అని ఒక అధికారి తెలిపారు.

మణిపూర్ మంత్రి గోవిందాస్ కొంథౌజామ్ మాట్లాడుతూ కనీసం 21 ఇళ్ళు కాలిపోయాయని, పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అల్లర్లను నియంత్రించడానికి అదనపు భద్రతా దళాలను మోహరించామని ఆయన తెలిపారు. సంబంధిత పరిణామంలో, లిటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లామ్లై చింగ్ఫీ కుకి గ్రామంలో ట్రక్కులు చెడిపోయిన తరువాత చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లను సోమవారం రక్షించినట్లు పోలీసులు తెలిపారు.